Telugu News

బూర్గంపాడు కు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలి

తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

0

బూర్గంపాడు కు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలి

?తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

?ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియజేస్తా: తహశీల్దార్ హామీ

(రిపోర్టర్ : రాజశేఖర్ రెడ్డి)

బూర్గంపహాడ్, ఆగష్టు 16(విజయం న్యూస్ )

గోదావరి వరదల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం.ముంపు వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం.బూర్గంపాడు కు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రమైన బూర్గంపాడులోని ఎస్సీ కాలనీకి చెందిన ముంపు బాధితులు మంగళవారం బూర్గంపాడు తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బూర్గంపా డు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలని ఫ్లెక్సీలను చేతబూనిన వరద ముంపు బాధితులు తమ గ్రామాన్ని పోలవరం ప్యాకేజీ లో చేర్చాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గోదావరి వరద వల్ల బూర్గంపాడు కు ఒకే నెలలో మూడు సార్లు 50 అడుగుల మేర గోదావరి చుట్టుముట్టిందని అన్నారు. ఈ ముంపు వల్ల ఈ బాధ పడలేమని, పోలవరం ప్యాకేజీ ప్రకటించాలని వారు అన్నారు. సురక్షితమైన స్థానాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణాలు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఈ సమస్య తలెత్తు తుందని ముంపులోనే బూర్గంపాడు లోతట్టు ప్రాంతమైన ఎస్సీ కాలనీ ఉంటుందని వారు పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వాలు చొరవ తీసుకుని బూర్గంపాడు కు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు తహశీల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు.

allso read- పాడే మోసిన తుమ్మల

== ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు వెళ్తా:బూర్గంపాడు తహశీల్దార్ హామీ
ధర్నా అనంతరం తహశీల్దార్ భగవాన్ రెడ్డి ముంపు వాసులు వినతిపత్రాన్ని అందజే శారు. సందర్భంగా తహసిల్దార్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ బూర్గంపాడు ముంపు వాసుల సమస్యలను జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమయంలో ప్రభుత్వ భూమి ఎక్కడైనా ఉంటే తమకు కేటాయిస్తే ఆ ప్రాంతానికి వెళ్తామని ముంపు వాసులు తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్లగా ,ఈ విషయాన్ని పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి బూర్గంపాడు వరద ముంపు బాధితులు తోకల రవి ప్రసాద్, కేసుపాక రామకృష్ణ, కేసుపాక కృష్ణ, ఇసం పల్లి వెంకటేశ్వర్లు, కె.వి. రమణ ,కేసుపాక బూబమ్మ , రాయల వెంకటేశ్వర్లు, తోకల శీను, తోకల రాము, అలవాల దుర్గా ప్రసాద్, నందిపాటి పండు, సుజీవ రాజు, తోకల చిన్ని , కేసుపాక తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

allso read- రోడ్డుపై బేటాయించిన సీఎల్పీ బృందం

== మణుగూరు క్రాస్ రోడ్డు అడవిలో ముంపు బాధితుల నిరసన:
బూర్గంపాడు మండలంలోని మణుగూరు క్రాస్ రోడ్డు అడవిలో గోదావరి బూర్గంపాడు ఎస్సీ కాలనీ ముంపు వాసులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముంపు వాసులకు ఈ స్థలంలోనే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది వరదలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఈ ప్రాంతంలో ఇళ్లస్థలాలు ఇవ్వటానికి ప్రభుత్వ అధికా రులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని కోరారు.