Telugu News

చిన్నారి మేఘన అదృశ్యంపై వీడని మిస్టరీ……? 

సంచలనం రేపిన బాలిక కిడ్నాప్..

0
చిన్నారి మేఘన అదృశ్యంపై వీడని మిస్టరీ……? 
?  సంచలనం రేపిన బాలిక కిడ్నాప్..
?నన్ను కిడ్నాప్ చేశారంటు ఆరోపించిన చిన్నారి మేఘన..
?హాస్టల్ వార్డెన్ సస్పెండ్, పీజీహెచ్ఎంకు షోకాజ్ నోటీస్
? ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి-ఎండి ప్రజా పంథా నాయకులు,పి.డి.ఎస్.యు,కుటుంబ సభ్యులు డిమాండ్
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 18(విజయం న్యూస్)
 బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ  బాలికల పాఠశాల విద్యార్థిని మీడియం మేఘన అదృశ్యం అయిన విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారి అనూహ్యంగా రెండో రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అదే హాస్టల్లో పై అంతస్తు భవనం లోని ఓ గదిలో బల్ల క్రింద దొరికిన విషయం అందరికీ తెలిసిందే.పాప దొరకడం తో ఒక్కసారిగా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.చిన్నారి మేఘన వైద్య పరీక్షల అనంతరం తనని ఇంటికి తీసుకు వెళ్ళిన తల్లి,దండ్రులు వారి బంధువులు.ఈ తరుణంలో కోన్ని నమ్మలేని నిజాలు బయట పెట్టిన చిన్నారి.ఆమె స్వయంగా మాట్లాడిన విషయాన్ని రికార్డింగ్ ద్వారా గత రెండు రోజుల నుండి పలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
ఇదే విషయమై స్వయంగా ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డులో ఎన్డీ ప్రజాపంతా పార్టీ పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిన్నారి మేఘన కోయ భాషలో మాట్లాడుతూ నన్ను నలుగురు ఎత్తుకెళ్లారని వారు నన్ను ఓ దుకాణం వద్దకు తీసుకు పోయి బిస్కెట్ ప్యాకెట్ లు కోనిచ్చి నా యొక్క నోటికి గుడ్డ కట్టి నన్ను సంచిలో వేసుకొని దూరంగా ఎటో తీసుకు పోయారు అని,తెల్లవారు జాము సమయంలో మళ్ళీ నన్ను తీసుకు వచ్చారు అని గోడ వెనుక నుండి నన్ను తీసుక వచ్చి పైన ఉన్న గదిలోని బల్లా క్రింద నెట్టి పెట్టారని ఆ నలుగురికి సహకారం అందించింది మా పాఠశాలలో పని చేసే వంట కుక్,నైట్ వాచ్ మెన్  అయిన కాంతమ్మ ఆంటీ నే అని బహటంగానే ఆరోపించింది ఆ చిన్నారి.ఇదే విషయమై  పి.డి.ఎస్.యు స్టూడెంట్ యూనియన్, సి.పి.ఐ,ఎం.ఐ ప్రజా పంథా నాయకులు ఎర్రయ్య మాట్లాడుతూ చిన్నారి చెప్పిన విషయాన్ని వివరిస్తూ విద్యార్ధి చిన్నారి కిడ్నాప్ చేయబడింది అని చిన్నారి మాటల ద్వారా గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వంట కుక్ కాంతమ్మ సహకారంతో చిన్నారి మీడియం మేఘన నీ కిడ్నాప్ చేశారని జిల్లా యంత్రాంగం ఉలిక్కి పడడంతో చిన్నారిని మరలా తీసుకు వచ్చి పాఠశాలలో దాచిపెట్టడం జరిగిందని దీనికి ఆశ్రమ పాటశాల సిబ్బంది పాత్ర కూడా కీలకంగానే ఉంటుంది అని  ఆరోపించారు.
అమాయకురాలైన 3వ తరగతి విద్యార్థిని మేఘన నోరు మూసి కాళ్ళు,చేతులు కట్టేసి సంచిలో వేసుకొని వెళ్లి పక్కా ప్లాన్ తో కిడ్నాప్ చేశారని విద్యార్థిని చెబుతున్న క్రమంలో తమకు అదే అనుమానం కలుగుతుందని వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఇప్పటికే వార్డెన్ నీ ఐటిడిఏ పిఓ సస్పెండ్ చేశారని,అదే విధంగా హెచ్.ఎం నీ, వాచ్మెన్ నీ వారికి సహకారం అందించిన కాంతమ్మ నీ వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపాటి పృద్వి, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సంధ్య, ముద్దా బిక్షం జిల్లా ప్రజాపంద కార్యవర్గ సభ్యుడు, డివిజన్ కమిటీ నాయకులు,చల్మన్ నగర్ గ్రామస్తులు, తల్లిదండ్రులు వెంకటేష్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు
==  *చిన్నారి విద్యార్థి కిడ్నాప్ విషయమై విచారిస్తున్నాం -ఎస్ఐ సంతోష్*
చిన్నారి కిడ్నాప్ సంఘటనపై  పాలవంచ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నామని ఎస్ఐ సంతోష్.విచారణలో భాగంగా ఆదివారం గిరిజన బాలికల వసతి గృహాన్ని సందర్శించి 40 నుంచి 50 మంది విద్యార్థులను సిబ్బందిని విచారించామని ఆయన తెలియజేశారు.
 *హాస్టల్ వార్డెన్ సస్పెండ్, పీజీహెచ్ఎంకు షోకాజ్ నోటీస్*
బూర్గంపాడు మండల కేంద్రంలోని ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాల విద్యార్థిని అదృశ్యమైన సంఘటనకు సంబంధించి హాస్టల్ వార్డెన్ బి సునీత ను సస్పెండ్ చేస్తూ ఐటిడిఎ పిఓ  గౌతం అదేశాలు జారీ చేశారు.అలాగే ఆ పాఠశాల పిజి హెచ్ఎంఎం సామ్రాజ్యం కు షో కాస్ నోటీసు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.