Telugu News

నిండా మునిగిన రైతన్న.. పత్తి పంటను ధ్వంసం చేసిన అడవి పందులు.

తీవ్రంగా నష్టపోయిన రైతన్న

0

రైతు వేసిన పత్తి పంటను ధ్వంసం చేసిన అడవి పందులు.

తీవ్రంగా నష్టపోయిన రైతన్న

(చండ్రుగొండ- విజయం న్యూస్ ):

అడవి పందుల వల్ల దాడిలో పత్తి పంటను ధ్వంసం అయిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. బాధిత రైతు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ  పరిధిలోని తిప్పనపల్లి గ్రామానికి చెందిన ధరావత్ లక్ష్మణ్ తనకు గల రెండు ఎకరాలు మెరక భూమిలో పత్తి పంటను ఈ ఏడాది సాగు చేశాడు. 50 వేల రూపాయలు పెట్టుబడి క్రింద ఖర్చు చేశాడు. పత్తి పంట చేతికందే సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున అడవిపందుల పత్తి చేనులో పడి రెండు ఎకరాల పత్తి పంటను ధ్వంసం చేశాయి. ఉదయం చేనుకు వెళ్లిన రైతు దంపతులు ధ్వంసం అయిన పత్తి పంటను చూసి కన్నీరుమున్నీరయ్యారు. తనకు గల రెండు ఎకరాలలో పత్తి పంట సాగు చేస్తే, తీరా చేతికందే సమయంలో అడవి పందులు దాడి చేయడం వల్ల మొత్తం నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంటలో కోల్పోయిన తనకు అధికారులు ఆదుకోవాలని రైతు దంపతులు కోరారు.

also read :- మద్యం షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల అరెస్టు

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*