Telugu News

ఎస్ఐ జితేందర్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు

చెడు వ్యసనాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

0

ఎస్ఐ జితేందర్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు

— చెడు వ్యసనాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక లో ఎస్ఐ జితేందర్ తన బృందంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. సారపాకలోని పలు దుకాణాలు అదేవిధంగా మందుబాబుల అనుమానిత అడ్డాలు అటవీ ప్రాంతాలు తనిఖీలు నిర్వహించారు.చెడు వ్యసనాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు అని ఎస్ఐ జితేందర్ తెలిపారు.యువత గంజాయి, మద్యం,గుట్కాలు వంటివి సేవించి విచ్చల విడిగా గ్రామాల్లో తిరుగుతున్నారని అంతే కాకుండా ద్విచక్ర వాహనాల పై అతివేగంగా (ర్యాస్) గా వెళ్తున్నారు ఇవన్నీ యువత మానివేసి మంచి మార్గంలో నడవాలి అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ రామకృష్ణ,ఫ్రూధ్వి,చందు లు వున్నారు..

సెల్ ఫోన్ కోసం భార్యను అమ్మేసిన భర్త