Telugu News

పేద విద్యార్థులకు బస్సు సౌకర్యం.

విద్యార్థులకు బస్సు పాసులను అందజేసిన ఖమ్మం సుడా చైర్మన్.

0

పేద విద్యార్థులకు బస్సు సౌకర్యం.

– విద్యార్థులకు బస్సు పాసులను అందజేసిన ఖమ్మం సుడా చైర్మన్.

 

పాండురంగాపురం,బల్లేపల్లి,ఖానాపురం, ఎన్టీఆర్ సర్కిల్,కొత్త బస్టాండ్,రాపర్తి నగర్ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 40 మంది విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సును మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాటు చేశారు.ఈ మేరకు సోమవారం ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ ఆయా విద్యార్థులకు బస్ పాస్ లను అందజేశారు,వారితో కలిసి అదే బస్సులో ప్రయాణించారు.ఈ సందర్భంగా వెళ్లే బస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా సుడా చైర్మన్ మాట్లాడుతూ:- ఈ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దండా జ్యోతి రెడ్డి.టిఆర్ఎస్ నాయకులు కొనకంచి ప్రసాద్,వలి,కంచర్ల దయాకర్,మాడూరి సైదారావు,ఫ్రాన్సిస్,సతీష్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
– విద్యార్థుల బస్ పాస్ కోసం ఆర్థిక సహాయం చేసిన కే.ఉపేందర్ ను బచ్చు విజయ్ కుమార్ అభినందించారు.

also read :-టీటీడీ ఓఎస్డీ శేషాద్రి ఇక లేరు.