Telugu News

ముమ్మరంగా సభ్యత్వ నమోదు

= లక్షన్నరకుపైగా సభ్యత్వాలు పూర్తి

0

ముమ్మరంగా సభ్యత్వ నమోదు
లక్షన్నరకుపైగా సభ్యత్వాలు పూర్తి
 మొదటిస్థానంలో మధిర.. రెండవ స్థానంలో పాలేరు నియోజకవర్గాలు
రెండు వర్గాలుగా విడిపోయి సభ్యత్వాలు
 సభ్యత్వానికి దూరంగా ఒక వర్గం..
 ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ
ఈనెల 9 చివరి గడువుగా ప్రకటించిన అదిష్టానం
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
ఏ పార్టీకైనా బలం.. బలహీనత.. సభ్యత్వ నమోదు.. ఆ సభ్యత్వ నమోదును భట్టే పార్టీ పటిష్టతను..బలాన్ని గుర్తిస్తుంది సమాజం.. వాటి స్థానాలను పదిలపరుస్తుంది.. అందుకే అన్ని పార్టీలు సభ్యత్వాలపై ఎక్కువ దష్టి సారిస్తారు.. ఎక్కువ సభ్యత్వాలు చేసేందుకు ప్రయత్నం చేస్తారు.. గత కొద్ది నెలల క్రితం టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా, దేశంలో అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును పూర్తి చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.. అధికార పార్టీకి ప్రత్యామ్నయ పార్టీ కాంగ్రెసా, బీజేపీ నా అనే చర్చ జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తమ బలం నిరూపించుకునేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి ప్రత్యామ్నయ పార్టీ కాంగ్రెస్ మాత్రమే అనే సందేశాన్ని ఇచ్చేందుకు ఆ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు.

also read :-వెంకయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం..

అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ అనుకున్న లక్ష్యం వైపు దూసుకపోతుంది.. ఇప్పటి వరకు 25లక్షలకు పైగా సభ్యత్వాలను నమోదు చేసి దూకుడు పెంచింది. ఈనెల 9 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమంకు పార్టీ అదిష్టానం అవకాశం ఇవ్వగా మిగిలిన 5లక్షల సభ్యత్వాలను పూర్తి చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది..కాగా జిల్లాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 1.50లక్షలకు పైగా సభ్యత్వం నమోదు చేసి టీఆర్ఎస్ తరువాత కాంగ్రెస్ బలమైన పార్టీగా నిరూపించింది. అయితే 2.50లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చాలా వ్యూహాత్మకంగా నియోజకవర్గ ఇన్ చార్జ్ లతో పాటు తక్కువ నమోదు అవుతున్న మండలాలకు పార్టీ అదిష్టానం ఇన్ చార్జ్ లను నియమించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. అలాగే బూత్ ఎన్ రోలర్ తో పాటు ఐదారు గ్రామ పంచాయతీలకు ఇన్ చార్జ్ లను నియమించి సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నారు.
== దూసుకపోతున్న మధిర నియోజకవర్గం.. రెండవ స్థానంలో పాలేరు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మధిర నియోజకవర్గం ముందు వరసలో నిలిచింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 3లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించగా, ప్రస్తుతం ఇప్పటి వరకు 1.50లక్షలకు పైగా సభ్యత్వాన్ని పూర్తి చేశారు. ఈనెల 9 వరకు సమయం ఉండటంతో మిగిలిన లక్ష సభ్యత్వాలను పూర్తి చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వంత నియోజకవర్గమైన మధిర సభ్యత్వ నమోదులో దూసుకపోతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 50వేల సభ్యత్వాలను పూర్తి చేశారు. మరో 50వేల సభ్యత్వాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

also read :-పంచాయితీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుని పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ ని కలిసిన

అలాగే పాలేరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 40వేలకు పైగా సభ్యత్వాలు నమోదైనట్లు తెలుస్తోంది. ఆ తరువాత వైరా, సత్తుపల్లి సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్న తెలుస్తోంది. కొత్తగూడెం, ఖమ్మం, ఆశ్వరరావుపేటలో కొంత సభ్యత్వ నమోదు విషయంలో వెనకబడినప్పటికి గత రెండు రోజులుగా సభ్యత్వ నమోదు వేగవంతం చేసినట్లు సమాచారం. వారు కూడా లక్ష్యానికి అనుగుణంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలుస్తోంది.
== పర్యవేక్షణ చేస్తున్న భట్టి విక్రమార్క
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పర్యవేక్షణ చేస్తున్నారు. ఆయన అన్ని నియోజకవర్గాల ఇన్ చార్జ్ లను నియమించి ప్రతి రోజు ఇన్ చార్జ్ లతో మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నారు. తక్కువ నమోదు అవుతున్న మండల నాయకులతో చర్చిస్తున్నారు. అత్యవసర సమావేశాలను నిర్వహిస్తున్నారు. వేగవంతంకు కావాల్సిన చర్యలను చేపడుతున్నారు. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎమ్మెల్యే పోదెం వీరయ్య లు మండలాల వారిగా నాయకులతో మాట్లాడుతూ పర్యవేక్షణ చేస్తున్నారు.

also read :-పాలేరు ఎమ్మెల్యే క్యాంఫ్ కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ ధర్నా..
==రెండు వర్గాలుగా నాయకులు … మరో వర్గం దూరం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నప్పటికి సభ్యత్వ నమోదు విషయంలో కూడా రెండు వర్గాల గోల నడుస్తూనే ఉంది. నియోజకవర్గ స్థాయిలో నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో వేరువేరుగా పనిచేస్తున్నారు. భట్టి విక్రమార్క వర్గం, సంభాని వర్గంగా వీడిపోయి వేరువేరుగా లింక్ లను తీసుకుని పనిచేస్తున్నారు. సంభాని వర్గీయులు సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు పాలేరు నియోజకవర్గంలోని రెండు మండలాల్లో పనిచేస్తున్నారు. వారే స్వంతంగా లింక్ లను తీసుకుని జిల్లా పార్టీకి, మండల పార్టీకి సంబంధం లేకుండా పనిచేస్తున్నారు.

సత్తుపల్లి నియోజకవర్గంలోని సంభాని ఇంచార్జ్ కావడంతో ఆయన మండల అధ్యక్షులకు బాధ్యతలను ఇచ్చారు. వారి సభ్యత్వ నమోదు వివరాలను జిల్లా పార్టీకి ఇవ్వడం లేదని తెలిసింది. జిల్లా పార్టీకి సంబంధం లేకుండా వారు పనిచేస్తుండటం గమనర్హం. ఇక రేణుక చౌదరి వర్గీయులు మాత్రం గురువారం వరకు స్పందించలేదు. సభ్యత్వ నమోదు కార్యక్రమంకు పూర్తిగా దూరంగా ఉన్నారు. కాగా గురువారం సాయంత్రం నుంచి వారు ప్రత్యేకంగా లింక్ లను తీసుకుని గ్రామాల్లో వారి వర్గీయులకు ఎన్ రోలర్స్ ను నియమించి లింక్ లను షేర్ చేస్తున్నారు. వర్గాలుగా విడిపోయినప్పటికి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో 2.50లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సభ్యత్వ నమోదు విషయంలో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తోంది. చూద్దాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరేన్ని సభ్యత్వాలను నమోదు చేస్తుందో..?

 

 

please subscribe this chanel smiling chaithu :-