Telugu News

యసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు.

సీఎం కెసిఆర్ ...

0

యసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు.
సీఎం కెసిఆర్ …

 

యాసంగిలో బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రం కరాఖండిగా చెప్పినందున వచ్చే సీజన్‌లో రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

కేంద్రం ధాన్యాన్ని తీసుకొంటేనే రాష్ట్రం సేకరణ మొదలుపెడుతుందని, రాష్ర్టానికి కొని, నిల్వ చేసే శక్తి ఉండదని స్పష్టంచేశారు. సోమవారం క్యాబినెట్‌ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడిన మాటలు సమగ్రంగా..* ‘కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి యాసంగిలో రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండవు.* కేంద్రం ధాన్యాన్ని తీసుకొంటేనే రాష్ట్రం సేకరణ మొదలుపెడుతుంది. కేంద్రం తీసుకోకుంటే మనం ఎక్కడ పెడుతం.

మనకు గోదాములు ఉండవు, నిల్వ చేసే పరిస్థితి ఉండదు. బియ్యమైనా, వడ్లయినా నిల్వ చేయడానికి, కాపాడటానికి శాస్త్రీయ పద్ధతి ఉంటది. వాటిని పీరియాడికల్‌గా నిల్వచేయాలి. తీసేటప్పుడు కూడా పద్ధతిగా తీయాలి. ఆ టెక్నాలజీ రాష్ర్టాల దగ్గర ఉండదు. దేశంలో ఏ ఒక్క రాష్ట్రం దగ్గర కూడా ఉండదు. మనం ఒకటి రెండు నెలలు తాత్కాలికంగా నిల్వ చేయగలుగుతం. కానీ సంవత్సరాల తరబడి దాచగలిగే శక్తి ఏ రాష్ర్టానికి కూడా లేదు. ఆ సామర్థ్యం ఉన్న కేంద్రమే.

also read :- అన్నదాతల సమస్యలు పట్టించుకోరా?