Telugu News

డిసెంబర్ 15 నాటికి  ‘రైతుబంధు’: సీఎం కేసీఆర్

నా జీవూన్నంత వరకు ఆ పథకాలు ఇస్తా

0

డిసెంబర్ 15 నాటికి  ‘రైతుబంధు’

== రైతుల ఖాతాలో నేరుగా వస్తయ్

== నా జీవూన్నంత వరకు రైతుబంధు,రైతుబీమా ఇస్తం

== 24 గంటల కరెంట్‌ ఇచ్చేది తెలంగాణే..ఆయన స్వంత రాష్ట్రంలో ఎన్నిగంటలిస్తున్నరో తెలుసా..

== జగిత్యా సభలో సిఎం కెసిఆర్‌ వెల్లడి

జగిత్యాల,డిసెంబర్‌7(విజయంన్యూస్):

నా జీవి ఉన్నంత వరకు రైతుల పథకం అమలు చేస్తా.. రైతు బంధు.. రైతు బీమా బతికున్నంత వరకు ఇస్తా.. ఎవలు గాబరగాబర కాకుంర్రీ.. అళ్లీళ్ల మాటలు నమ్మకుర్రీ… రైతుబంధు ఇచ్చే ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే.. కొట్లాడి తెచ్చుకున్నది అందుకేగా..? రైతు బంధే కాదు.. రైతు బీమా కూడా ఇస్తం..అంటూ సీఎం కేసీఆర్ అన్నదాతలకు సీఎం కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. మరో పదిరోజుల్లో  రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేబినెట్‌ మీటింగ్‌లో రైతు బంధుపై నిర్ణయం తీసుకుంటామని..ఆ తర్వాత రైతు బంధు నిధులు విడుదల చేస్తామన్నారు. బ్యాంకుల్లో  డబ్బులు జమ చేయగానే..రైతుల ఫోన్లలో టింగు టింగు మంటూ మేసేజ్‌ లు వస్తాయన్నారు.

ఇది కూడా చదవుర్రీ..: మోదీజీ చర్చకు సిద్దమా..? : సీఎం కేసీఆర్

ఎక్కడైనా ఈ తరహా పథకం ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ బతికున్నంత వరకు రైతు బంధు, రైతు బీమా  పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢల్లీితో పాటు..మోడీ సొంత రాష్ట్ర గుజరాత్‌ లో కరెంట్‌ కోతలు, సాగునీటికి ఇబ్బందులున్నాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు.  దేశంలోని ప్రతీ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ సరఫరా అవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు ఉండొద్దని చెప్పారు. దేశ భవిష్యత్‌ కోసమే చెప్తున్నానని.. మోసపోయి ఉంటే గోసపడతామని ప్రజలు ఆలోచించాల న్నారు.  రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో  24 గంటల కరెంట్‌ ఇస్తున్నామన్నారు. ఏడాదికి రూ.  13 వేల కోట్ల నుంచి రూ. 14 వేల కోట్ల వరకు రైతుల కోసం ప్రభుత్వం విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తుందన్నారు. అన్నదాతల కోసం రైతు బీమా, రైతు బంధు పథకాలను అమలు చేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా పథకాలు లేవని చెప్పారు. కానీ కేంద్రం ఉచితాలు ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తోంద న్నారు. బోర్లకు విూటార్లు పెట్టాలని చెప్తోందని మండిపడ్డారు. అటు రైతులు పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నామన్నారు. పది రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నామన్నారు.

ఇది కూడా చదువుర్రీ: బంగ్లాపై టీమిండియా ఘోర పరాజయం

బ్యాంకుల్లో  డబ్బులు జమ చేయగానే..రైతుల ఫోన్లలో టింగు టింగు మంటూ మేసేజ్‌ లు వస్తాయన్నారు. ఎక్కడైనా ఈ తరహా పథకం ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ బతికున్నంత వరకు రైతు బంధు, రైతు బీమా  పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలోని బండలింగాపూర్‌ను మండలంగా చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. జిల్లాలోని  వరద కాల్వలపై తూములు నిర్మించుకున్నామన్నారు. వరద కాల్వల విూద 13వేల మోటర్లు ఉన్నాయని చెప్పారు. అటు వేములవాడలోని కథలాపూర్‌, భీమారంతో పాటు మరో మండలానికి సాగునీటిని సరఫరా చేస్తామన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మద్దుట్ల వద్ద లిప్ట్‌ ఇరిగేషన్‌  ప్రాజెక్టు నిర్మిస్తామని హావిూ ఇచ్చారు. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలను చూశారని….ఈ ప్రాంతంలో అనేకమంది మంత్రులయ్యారని చెప్పారు. కానీ ఒక్కరు కూడా బీడీ కార్మికులకు పింఛన్‌ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తోందన్నారు. దేశంలో 16 రాష్టాల్ల్రో  బీడీ కార్మికులున్నారని..కానీ తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు పించన్‌ ఇస్తున్నట్లు వెల్లడిరచారు.

దేశంలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్‌ వన్‌ గా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో..తలసరి ఆదాయంలో…ఆర్థిక వనరుల పెంపులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. 8 ఏండ్లలో తెలంగాణ పనిచేసిన మందం కేంద్రం పనిచేసుంటే..రాష్ట్ర తలసరి ఆదాయం పద్నాలుగున్నర లక్షలు ఉండేదన్నారు.

ఇది కూడా చదువుర్రీ: మ్యాచ్ లో గాయపడ్డ రోహిత్‌శర్మ