Telugu News

మండలంలో కేబుల్ దొంగలు హల్ చల్…

లబోదిబోమంటున్న రైతులు...

0

మండలంలో కేబుల్ దొంగలు హల్ చల్…

లబోదిబోమంటున్న రైతులు…

చండ్రుగొండ( విజయం న్యూస్ ) :

 

మండల పరిధిలోని తిప్పన పల్లి గ్రామంలో కలకలం, కోనేరు నాగేశ్వరరావుగారి మామిడి తోట సమీపంలోగల పొలాలలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రైతు ల వ్యవసాయ బోరుమోటార్ల 3 core కేబుల్ వైర్ లు కత్తిరించి దొంగలించారు. సుమారుగా పదిహేను ఇరవై మోటార్ల వైర్లు కట్ చేశారు. అక్కడ పంట పొలాల్లో వేసుకున్న రైతులు వారి పొలాలకు నీళ్లు అందించకపోతే పంట చేతికి రాదు అని విలపిస్తున్నారు. ఇటీవల కాలంలో లో ఫారెస్ట్ మోటార్లు కూడా దొంగలించి పోయారని వార్త కూడా అందరికీ తెలిసిందే కావున మన చండ్రుగొండ మండల ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ తరఫునుంచి , రైతులకు పోలీసులకు సహకరిద్దాం. ఇలాంటి దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే యూనియన్ కి పోలీసువారికి సమాచారం ఇవ్వగలరని యూనియన్ తరఫున కోరుకుంటున్నాం.
తిప్పన పల్లి గ్రామంలో మోటార్ కేబుల్ కోల్పోయిన రైతులు.1. లంక నరసింహారావు,2. కందిమల్ల శ్రీను.3.పసుపులేటి వెంకటేశ్వర్లు.4. మట్ల తిరుపతయ్య,5 అర్జున,6. ధరావత్ కాలు,7. చాంద్ సాబ్ తదితరులు రైతులు ఉన్నారు…