Telugu News

కాల్షియం కార్బైడ్ పండ్లు ప్రాణాంతకాలు

డాక్టర్ నన్నపనేని అంజన్ కుమార్, జనరల్, మరియూ లాప్రస్కోపిక్ సర్జన్

0

కాల్షియం కార్బైడ్ పండ్లు ప్రాణాంతకాలు

డాక్టర్ నన్నపనేని అంజన్ కుమార్,
జనరల్, మరియూ లాప్రస్కోపిక్ సర్జన్

(మహబూబాబాద్- విజయం న్యూస్)

పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు! అందులోనూ మామిడి, అరటి, యాపిల్‌ అంటే నోరూరనివారు ఎవరుంటారు..? కాని ఆ పండ్లని మగ్గపెట్టేందుకు వాడే విషపదార్థాల గురించి వింటుంటేనే భయం కలుగుతోంది. మరీ ముఖ్యంగా కార్బైడ్‌తో పండించిన పండ్లని ముట్టుకోవాలంటేనే దడ పుడుతోంది. మరి నిజంగానే కార్బైడ్‌ అంత ప్రమాదకరమైనదా..? అయితే దాన్ని ఎందుకు వాడుతున్నారు..?
ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన భాధ్యత ప్రభుత్వానిదే. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం నిర్లక్ష్యం వహిస్తే ప్రజారోగ్యంపై తీవ్ర పరిణామాలు ఎదురవ్వడం ఖాయమని వైద్యరం నిఫుణులు హెచ్చరిస్తున్నారు.

also read :-డివిజన్లలో సమస్యలు లేకుండా చూడాలి

ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పద్మావతి నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ నన్నపనేని అంజన్ కుమార్,జనరల్,మరియూ లాప్రస్కోపిక్ సర్జన్ మాట్లాడుతూ
కార్బైడ్‌ పండ్లతో కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని. వాంతులు, నీళ్ల వీరేచనాలు, రక్తంతో కూడిన జిగట విరేచనాలు, కడుపులో, ఛాతీలో మంట, విపరీతమైన దాహం, నీరసం, కళ్లలో దురద, మంట, చర్మంపై పుండ్లు, నోరు, ముక్కు,గొంతు లో దురద, దగ్గు, గొంతునొప్పి, శ్వాస సరిగా అందకపోవడం.వంటి ప్రభావాలు కనిపిస్తాయని అన్నారు.

also read ;-ఖమ్మంలో మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం
కేల్షియం కార్బైడ్‌లో అర్సెనిక్‌, ఫాస్పరస్‌ అనే రసాయనాలు ఉంటాయని. ఇవి అధిక మొతాదులో శరీరంలోకి చేరితే ఏర్పడే సమస్యలు అన్నీఇన్నీ కావని హెచ్చరించారు. తలనొప్పి, కళ్లు తిరగడం, నిద్రలేమి మొదలుకొని నరాలకు సంబంధించిన నానారకాల సమస్యలకూ ఇది దారితీయవచ్చునాని చర్మం మీద కూడా కార్బైడ్‌ ప్రభావం అధికంగా ఉంటుందని అన్నారు. దద్దుర్లు నుంచి చర్మక్యాన్సర్‌ వరకూ కార్బైడ్‌ పండ్లని తినేవారిలే ఎలాంటి రోగమైనా తలెత్తవచ్చు. ఇక గుండె, మెదడు, కీళ్లు, జీర్ణాశయం వంటి శరీర భాగాల మీద ఈ కార్బైడ్‌ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గర్భిణీ స్త్రీలు కనుక కార్బైడ్‌తో మగ్గపెట్టిన పండ్లని తింటే… అవి వారికీ, వారి కడుపులో ఉన్న బిడ్డకీ కూడా ప్రమాదమని తెలిపారు.