Telugu News

నేడే లెక్కింపు ** ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభం.

** నాలుగు టెబుల్స్ ఏర్పాటు

0

నేడే లెక్కింపు
** ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభం
** నాలుగు టెబుల్స్ ఏర్పాటు
** మధ్యాహ్నం 11గంటలకే ఫలితం తేలే అవకాశం
** భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
** కౌంటింగ్ కేంద్రం చుట్టు భారీ బందోబస్తు
** 200 మంది పోలీసులతో గస్తి
** సంబరాలను నిషేదించిన పోలీసులు
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఉమ్మడి ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసింది.. లెక్కింపు మిగిలింది.. అందుకు గాను మంగళవారం లెక్కింపు కార్యక్రమం ఉండగా, సంబంధిత అధికారులు సర్వం సిద్దమైయ్యారు. ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. అంతకంటే గంట ముందు అధికారులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని లెక్కింపు ప్రక్రీయను షూరు చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 768 ఓట్లకు గాను 736 ఓట్లు పోలైయ్యాయి. దీంతో లెక్కింపు కోసం నాలుగు టెబుళ్లను అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్ కు నలుగురు లెక్కింపు ఉద్యోగుల చొప్పున మొత్తం 16 మందిని ఎంపిక చేశారు. వారికి ఇప్పటికే శిక్షణనిచ్చారు. అయితే అధికారులకు కానీ, ఏజెంట్లకు కానీ, అభ్యర్థులకు గానీ లెక్కింపు కేంద్రంలోకి వెళ్లేవారికి ఎలాంటి వస్తువులను అనుమతించరు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్, పెన్నులు, పేపర్లు, మంచినీటి సీసాలను అనుమతి నిరాకరిస్తూ కలెక్టర్ వి.పి.గౌతమ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఐడీ కార్డు లేకపోతే అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
లెక్కింపు ఇలా…?
ఖమ్మం జిల్లాలో మొత్తం 736 ఓట్లకు గాను ప్రతి 25 ఓట్లను కట్టగా కట్టి వేరు చేయనున్నారు. ఆ తరువాత 25 ఓట్లను ఓపెన్ చేసి ప్రతి ఓటును ఏజెంట్లకు చూపించి అభ్యర్థుల బాక్స్ లలో వేయనున్నారు. ముందుగా మొదటి ప్రాథన్యత ఓట్లను లెక్కించనున్నారు. మొదటి ప్రాధన్యత ఓట్ల ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరికి మెజారిటీ రాకపోతే రెండవ ప్రాథన్యత ద్వారా లెక్కించనున్నారు. అయితే ఇందులో చివరి నుంచి ఎలిమినేషన్ పద్దతి ద్వారా ఓటింగ్ లెక్కించనున్నారు. మొదటిగా నాల్గొవ ప్లేస్ లో ఉన్న అభ్యర్థిని, ఆ తరువాత మూడవ ప్లేస్ లో ఉన్న అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ రెండవ ప్రాథన్యత ఓట్లను లెక్కించనున్నారు. అప్పటికి ఫలితం రాకపోతే రెండవ స్థానంలో ఉన్న వ్యక్తిని ఎలిమినేట్ చేసి మొదటి స్థానంలో ఉన్న వ్యక్తిని విజేతగా ప్రకటించనున్నారు. ఈ పద్దతిలో ఎమ్మెల్సీ ఫలితాల లెక్కింపు ఉండనుంది.
భారీ బందోబస్తు.
లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఖమ్మం జిల్లా పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడెంచల బందోబస్తు నిర్వహించిన పోలీసులు స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్స్ లు తీసుకెళ్లంత వరకు భారీబందోబస్తును నిర్వహించనున్నారు. అలాగే లెక్కింపు కేంద్రం వద్ద చుట్టూ 100 అడుగుల ధూరంలో రెండంచల బందోబస్తును నిర్వహించనున్నట్లు సీపీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. నలుగురు ఏసీపీలతో పాటు 200 మంది పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఖమ్మం నగరం మొత్తం పోలీస్ బందోబస్తును నిర్వహిస్తూ ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా అప్రమత్తం చేశారు. అలాగే విజయోత్సవ ర్యాలీలను, సంబరాలను నిషేదించారు.
జోరుగా బెట్టింగ్స్.
ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నేలకొంది.. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా నువ్వా నేనా..? అన్నట్లు పోలింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తుండటం, ముమ్మరంగా ప్రచారం జరుగుతుండంతో బెట్టింగ్ రాయుళ్లు తెరపైకి వచ్చారు.మంగళవారం జరిగే లెక్కింపులో ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటూ..? ముమ్మరంగా బెట్టింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం కేంద్రంగా, హైదరాబాద్ సబ్ కేంద్రంగా బెట్టింగ్ జోరుగా జరిగినట్లు సమాచారం. అయితే ఎక్కువగా కాంగ్రెస్ గెలుస్తుందని లక్షల లక్షల బెట్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు టీఆర్ఎస్ గెలుస్తుందని బెట్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఎదైతేమి ఖమ్మం ఏకగ్రీవం అవుతాయని భావించిన ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలు బెట్టింగ్ వైపు తీసుకొచ్చిందంటే ఎంత క్రాస్ ఓటింగ్ పడిందో అర్థమవుతుంది..? చూద్దాం .. ఫలితాల్లో గెలుపు ఎవరిదో..?

also read :- గౌడ కులస్తుల సేవలను కొనియాడిన హీరో సుమన్…

 

please subscribe this chanel smiling chaithu