Telugu News

జనవరి నాటికి వచ్చింది రూ.85,378.59 కోట్లు

కాగ్‌కు ఆర్థిక శాఖ నివేదిక

0

పన్ను రాబడుల్లో జోరు

?జనవరి నాటికి వచ్చింది రూ.85,378.59 కోట్లు

?కాగ్‌కు ఆర్థిక శాఖ నివేదిక

(విజయం న్యూస్ ):-
పన్నుల వసూళ్లలో రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించింది. కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)కు రాష్ట్ర ఆర్థిక శాఖ సమర్పించిన నివేదిక ప్రకారం.. జీఎస్టీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, సేల్స్‌ టాక్స్‌, స్టేట్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, ఇతర పన్నులన్నింటి కింద 2021- 22 ఆర్థిక సంవత్సరంలో రూ.1,06,900.13 కోట్లు అంచనా వేయగా..

also read :-సీఎం కేసీఆర్‌తో సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి, రాకేశ్ తికాయ‌త్ భేటీ

జనవరి 31 నాటి కి రూ.85,378.59  కోట్లు (79.87శాతం) సమకూరాయి. 2020-21లో రూ.1,02,026.58 కోట్ల రాబడిని అంచనావేయగా…2021 జనవరి నాటికి రూ.60,424.72 కోట్లు (59.22 శాతం) వచ్చాయి.ఈ పన్నుల, పన్నేతర రాబడి, కేంద్ర గ్రాంట్లు, అన్నీ కలిపి రెవె న్యూ రాబడులకింద రూ.1,76,126.94 కోట్ల ను అంచనా వేయగా… ఈ జనవరినాటికి రూ.98,282.67 కోట్లు (55.80శాతం) సమకూరాయి. మరోవైపు రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లలో భారీ కోత పడుతోంది.