పాలేరులో కందాళ గెలుపు ఆపగలరా..?
== మోడీ కోవర్టులు ఉపేందర్ రెడ్డిని ఏం పీకలేరు
== పాలేరు అభివృద్దికి మేమంతా సహాయం చేస్తాం
== సీఎం కేసీఆర్ కు కందాళ అంత్యత సన్నిహితుడు
== సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ప్రశాంత రెడ్డి
== పదికి పది సీట్లు గెలిచి సీఎం కు కానుకగా ఇస్తాం
== ధీమా వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
== కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ : నామా నాగేశ్వరరావు
== దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది: గాయత్రి రవి
== పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు
== పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు
(కూసుమంచి, ఖమ్మం రూరల్-విజయంన్యూస్)
పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని ఓడించగలిగే వారు ఉన్నారా..? ఆయన గెలుపును ఎవరైనా అపగలరా..? మళ్లీ గెలిచేది ఆయనే..అందులో ఎంతమాత్రం డౌటే లేదు అంటూ రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేమలు ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు, ఆయన కొంత పర్వాలేదనుకున్నాము, కానీ ఇక్కడ ప్రజాధరణ చూస్తుంటే కందాళ మాములోడు కాదని అనిపిస్తుందని మంత్రి కొనియాడారు.
ఇది కూడా చదవండి: ‘అమాత్యుల’ వ్యాఖ్యలు ఎవరికి గుణపాలు..?
శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, ఖమ్మంరూరల్, తల్లాడ, కల్లూరు మండలాల్లో పర్యటించారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి, ఎమ్మెల్సీ తాతామదుసూదన్, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి పలు రహదారుల నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామన్నపేట లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కందాళ ఉపేందర్ రెడ్డి చాలా సౌమ్యుడని, ఆయన ఎంత వరకు మాట్లాడాలో, ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడి మా అందరి చేత పనులు చేయించుకుంటాడని అన్నారు. ఆయన మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి రహదారులను మంజూరు చేయాలని కోరిన వెంటనే వాటిని మంజూరు చేశానని అన్నారు. మేము పాలేరు నియోజకవర్గంలో పర్యటించడానికి వచ్చినప్పుడు ప్రజలు తరలివచ్చి మాకు స్వాగతం పలుకుతుంటే ఆ సంతోషం ఎనలేనిదన్నారు. కందాళ ఉపేందర్ రెడ్డి అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపారు.
== కందాళ ఉపేందర్ రెడ్డి గెలుపు ఆపగలరా..?
పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కందాళ ఉపేందర్ రెడ్డి తిరిగి మరోసారి పోటీ చేస్తారని, ఆయన గెలుపును ఎవరైనా ఆపగలరా..? అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. నరేంద్రమోడీ దింపిన మరో పార్టీలకు చెందిన వాళ్లు కావచ్చు(షర్మిళ), మోడీ కోవర్టులుగా మారి రాజకీయాలు చేస్తున్న వారు కావచ్చో కందాళ ఉపేందర్ రెడ్డిని ఓడించగలరా..? అని సవాల్ చేశారు. పాలేరు నియోజకవర్గం కోసం కందాళ ఉఫేందర్ రెడ్డి ఎంతగానో కష్టపడతున్నారని, ఆయన మంత్రులందరి వద్దకు వెళ్లి పనులు మంజూరు చేయాలని కోరుతుండటం సంతోషకరమన్నారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం కాంగ్రెస్ కు షాకిచ్చిన కార్పోరేటర్
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు వేదికపై ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరి మద్దతు ఉంటుందని, మా అందరి సపోర్టు ఉంటుందని అన్నారు. సీఎం కేసీఆర్ కు కందాళ మంచి సన్నిహితుడు, స్నేహితుడని, ఆయనంటే సీఎంకు చాలా ఇష్టమని అన్నారు. ఆయన ఏ పని అడిగిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తక్షణమే మంజూరు చేస్తారని, మాలాంటి మంత్రులకు చెప్పి నిధులు కేటాయిస్తారని, అలాంటి మంచి మనిషి పాలేరు నియోజకవర్గానికి లభించాడని అన్నారు. రాష్ట్రం ఇప్పటికే అనేక రంగాల్లో అభివృద్దిపథకంలో దూసుకపోతుందని, దేశంలోనే అభివృద్ది రాష్ట్రంగా పేరొందిన తెలంగాణ రాష్ట్రం మరింతగా అభివృద్ది చెందాలంటే సీఎం కేసీఆర్ మరోసారి సీఎంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ప్రజలందరు ప్రజల కోసం నిరంతరం శ్రమికులై పనిచేసే సీఎం కేసీఆర్, ఆయన టీమ్ ను కచ్చితంగా గెలిపించాలని, మద్దతు తెలిపాలని కోరారు.
== పదికి పది సీట్లు గెలుస్తాం: మంత్రి పువ్వాడ
ఖమ్మం జిల్లా మునుపెన్నడు లేనంతగా అద్భుతంగా అభివృద్ది చెందిందని, రాష్ట్రంలోనే అభివృద్ది విషయంలో సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో దూసుకపోతున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం వెలుగు ఖిల్లాగా మారిందన్నారు. మన రాష్ట్రమే కాకుండా దేశ, విదేశాల్లో ఉన్నవారు కూడా ప్రభుత్వం అభివృద్ది అయిన ఖమ్మంను చూసి అశ్ఛర్యపోతున్నారని అన్నారు. ఆ విధంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మనకు సహాకరించారని, వారికి మనందరి తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లా మరింత అభివృద్ది చెందాలంటే ప్రజలందరి ఆశీస్సులు కావాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరు బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తారని, పదికిపది స్థానాలను గెలిచి సీఎం కేసీఆర్ కు గిప్ట్ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.
== దేశంలోనే నెంబర్ తెలంగాణ రాష్ట్రం : నామా ఇది కూడా చదవండి: ‘పేట కాంగ్రెస్’ లో అధిపత్య పోరు
దేశంలోనే అభివృద్ది విషయంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ లో ఉందని, ఏ రాష్ట్రం కూడా ఇలాంటి అద్భుతమైన పథకాలను అమలు చేయలేదని పార్లమెంటరీ పార్టీ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పచ్చని తెలంగాణగా, ధాన్యబండారుతెలంగాణగా, బంగారు తెలంగాణగా మారిందని అన్నారు. అలాంటి అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. దేశమే మన రాష్ట్రం వైపు చూస్తుందని, సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా మంచి రహదారులను మంజూరు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కోరగా ఎంపీలకు ఒక్కోక్క రహదారిని పెడుతున్నామని, మీరు అడిగారు కాబట్టి రెండు పెడుతున్నానని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశానని, అందు
కు అడ్డగానే రహధారులను మంజూరు చేసిన మంత్రులకు ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు.
== దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది : గాయత్రి రవి
భారతదేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ది విషయంలో, సంక్షేమం విషయంలో దూసుకపోతుంటే యావత్తు దేశం మొత్తం తెలంగాణ అభివృద్ది వైపు చూస్తున్నారని రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే బెస్ట్ రాష్ట్రంగా నిలిచిందని, ఇది మనం చెప్పడం కాదుకానీ బీజేపీ ప్రభుత్వమే చెబుతుందని, ఇప్పటికే పదుల సంఖ్యలో పథకాలకు అవార్డులు కూడా వచ్చిన పరిస్థితిని ప్రజలందరు చూస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం భారతదేశానికి అవసరమనే విషయాన్ని ఆయా రాష్ట్రాల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రులు చెబుతున్నారని, ఆయన దేశ్ కి నేత గా ఎదగడం అందరికి సంతోషకరమన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ప్రత్యామ్నయ పార్టీగా బీఆర్ఎస్ నిలవబోతుందని స్పష్టం చేశారు.
== పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు ఇది కూడ చదవండి: పొంగులేటి వ్యూహమేంటి..? వాట్ నెక్ట్స్..?
కూసుమంచి మండలం ఈశ్వరమాధారంలో రూ.15 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు, అలాగే రాజుపేట నుంచి పెరికసింగారం వరకు డబుల్ బీటీ రోడ్డు కు రూ.15కోట్లు మంజూరు కాగా, ఆ నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు & భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసుధన్, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శంకుస్థాపన చేశారు. అలాగే ఖమ్మం రూరల్ మండలంలోని ధనువాయిగూడెం, రామన్నపేట, కామంచికల్, పాపటిపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ33 కోట్లు మంజూరు కాగా ఆ నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు.
== ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు
హైదరాబాద్ నుంచి కూసుమంచి మండలానికి వచ్చిన మంత్రులకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కూసుమంచి మండలంలోని రాజుపేట వద్ద ఘనంగా స్వాగతం పలకగా, అనంతరం ఖమ్మం రూరల్ మండల వరకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. అక్కడ దనువాయి గూడెం సమీపంలో మంత్రులకు ఖమ్మం రూరల్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కోలాట డ్యాన్సులతో అలరించారు. అలాగే మంత్రులను గజమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుకురాకూల నాగభూషణo, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, రైతు బంధు కమిటీ కన్వీనర్ నల్లమళ్ళ వెంకటేశ్వరరావు, కల్లూరిగూడె సోసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్, సర్పంచ్ వెంకటేశ్వరరావు, వాసంశెట్టి అరుణ, ఎంపీటీసీ మోదుగు వీరభద్రం, ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పీటీసీ ప్రసాద్ తదితరులు హాజరైయ్యారు.