Telugu News

పాలించడం మనకు చేతకాదా..:ఎమ్మెల్యే కందాళ

ప్రజలందరు ఈ ప్రాంతబిడ్డలైనప్పుడు.. నాయకులు పరాయివాళ్లు కావాలా..?

0

పాలించడం మనకు చేతకాదా..:ఎమ్మెల్యే కందాళ

== ప్రజలందరు ఈ ప్రాంతబిడ్డలైనప్పుడు.. నాయకులు పరాయివాళ్లు కావాలా..?

== సంచలన వ్యాఖ్యలు చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

== సేవచేయాలనేదే నా అభిమతం

== ఆశీర్వదిస్తే మరింత అభివద్ది చేసి చూపిస్తా

== చేగొమ్మలో జరిగిన సమావేశంలో సంచలన ప్రకటన

== గ్రామంలో ముమ్మరంగా పర్యటించిన ఎమ్మెల్యే

(కూసుమంచి-విజయంన్యూస్)

ప్రజలందరు మనవాళ్లైతే.. పాలించేవాళ్లు పరాయివాళ్లు కావాలా..? పరిపాలన చేయడం మనకు చేతగాద అంటూ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూసుమంచి మండలంలోని చేగొమ్మ గ్రామంలో ఏర్పాటు చేసిన ముక్యకార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయేతర నాయకులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇక్కడ కూర్చున్న వాళ్లంతా ఈ ప్రాంత బిడ్డలైనప్పుడు, నాయకులు పరాయి వాళ్ళు కావాలా..

allso read- పొంగులేటి వర్గంలో ‘పాలేరు’ అభ్యర్థి ఎవరు..?

మనకు చేత కాదా పాలించడమని ప్రజలకు సూచించారు.  మట్టికైనా ఇంటోడు కావాలి అని సామెత ఉందని, ఈ సామెతను బేరేజుగా వేసుకుని ఈ ప్రాంత వాసిగా నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ ఊరికి ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్లు వస్తున్నారని, వాళ్లతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందని పిలుపునిచ్చారు. నాలుగు రోజులు వస్తారు, వెళ్తారు..నేను మాత్రం కచ్చితంగా ఇక్కడ ఉండేవాడ్నేనని, నాకు మాట్లాడటం చేతగాదు.. మాయమాటలు చేప్పే రకం కాదని, పనిచేయడం, నాకు చేతనైనంత సహాయం చేయడమే నాకు తెలుసుని అన్నారు. నా అభిమతం..నా ఆశయం.. ఈ ప్రాంత వాసిగా ప్రజలకు కొంతైనా చెయ్యాలనేదే నా తపన అని అన్నారు. ఎంజాయ్ చేయాలి అనుకుంటే నాకు చాలా అర్థిక శక్తి ఉందని, కానీ నా ప్రాంత బిడ్డలకు, ప్రజలకు ఏదో ఒక రకమైన సేవ చేయాలనేదే నా అభిమతం అని చెప్పారు. అందుకే నేను  నా సతీమణి ప్రతి గ్రామం వెళ్తున్నామని,  ప్రతి ఇంటికి వెళ్తున్నామని,  ప్రతి వారిని కలుస్తున్నామని, ప్రతి ఒక్క కుటుంబానికి అసరగా ఉంటున్నామని అన్నారు.

allso read- ‘సత్తుపల్లి’ లో అక్రమ మట్టి మాఫియా

నాకు కుల మతాలు, ఉన్నవారు, లేనివారనే బేదాలు లేవని, ప్రజలందరు నాకు సమానమే, సమానంగానే చూస్తానని అన్నారు. చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా అందరు నా క్యాంఫ్ కార్యాలయంకు వచ్చి సమస్యలను చెప్పుకోవచ్చాను. నేను గెలిచిన ఈ నాలుగేళ్లలో పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనులు చేశానని గుర్తు చేశారు. ప్రజలందరు నన్ను మరోసారి ఆశీర్వదిస్తే కచ్చితంగా మరింతగా పాలేరును అభివద్ది చేసి చూపిస్తానని హామినిచ్చారు. అనంతరం చేగొమ్మ గ్రామంలో పలు నిర్మాణ పనులను, డొంకలను పరిశీలించారు. పేద ప్రజలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని హామినిచ్చారు.