Telugu News

రూ.2వేల నోట్ రద్దు

మంచినిర్ణయం అని అంటున్న వాణిజ్య ఎనాలసిస్ట్ లు, రాజకీయ విశ్లేషకులు

0

రూ.2వేల నోట్ రద్దు

== సంచలన ప్రకటన చేసిన ఆర్బీఐ

== రూ.2వేల నోట్లను ఉపసంహరించుకున్నఆర్ బీఐ..?

== మంచినిర్ణయం అని అంటున్న వాణిజ్య ఎనాలసిస్ట్ లు, రాజకీయ విశ్లేషకులు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఆర్బీఐ సంచనల ప్రకటన చేసింది.. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సంచలన ప్రకటన చేసిన ఆర్ బీఐ ఇప్పుడు మరోసారి  అర్థిక మహారాజు గుండెల్లో పరుగెత్తే ప్రకటన చేసింది.. నోట్ల రద్దు సమయంలో ఉన్నఫలంగా పరిగణంలోకి తీసుకున్న ఆర్బీఐ దేశ వ్యాప్తంగా సర్క్యూలేషన్ చేసింది. , ప్రస్తుతం ఆ నోట్లను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) అధికారికంగా ప్రకటన చేసింది. ఇప్పటికే రూ.2వేల నోట్లను ప్రింటింగ్ ఆపినట్లుగా తెలుస్తోంది. ఎక్కడ కూడా రెండు వేల నోట్లు చెలామణిలో లేవు..చాలా అరుదుగా కనిపిస్తున్నాయి.  అయితే రెండువేల నోటు ఉపసంహరణ వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదని ఆర్బీఐ ప్రకటించింది. ఉన్న డబ్బులను డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పింది. దీంతో ఒక్క సారిగా దేశవ్యాప్తంగా అలజడి మొదలైంది.

ఇది కూడా చదవండి: జోష్ లో ఖమ్మం జర్నలిస్టులు

ఈ నిర్ణయంతో  పేదవారికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికి అర్థిక మహారాజులకు మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైన ప్రకటనే అని చెప్పాలి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే  బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2016లో నోట్ల రద్దు ప్రకటన చేసింది. దీనికి ఆర్బీఐ కూడా అమోదించింది. దీంతో ఉన్నఫలంగా రూ.2000ల నోట్ ను నవంబర్ 10, 2016లో ప్రవేశపరిచారు. మహాత్మగాంధీ బొమ్మతో మూడు కలర్లతో ఈ నోట్ ను ప్రింట్ చేసిన ఆర్బీఐ ఆ తరువాత చాలా స్వల్పంగా ప్రింట్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం రూ.2వేల నోట్లు చెలామణి విషయంలో కొంత జాప్యం జరుగుతూనే ఉంది. అయితే రెండువేల నోట్ వచ్చిన తరువాత అవినీతి పెరిగింది. ఎన్నికల్లో ఖర్చులు పెరిగాయి.. ఓటుకు రూ.2వేలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

== సంచలన ప్రకటన చేసిన ఆర్బీఐ

రెండువేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఇండియా ప్రకటించింది. మే 20 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రజలందరు ఎవరు ఇబ్బంది పడోద్దని, సెప్టెంబర్ 30లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ప్రకటించారు. పది నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం ఇస్తున్నామని, బ్యాంకుల్లోకి వెళ్లి డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. దీంతో ప్రజలేవ్వరు ఇబ్బందులు పడే అవకాశం లేదు. కానీ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.. ఇందులో నల్ల దనాన్ని బయటకు తీసే ప్రక్రీయ కూడా ఉందని రాజకీయ , వాణిజ్య విశ్లేషకులు చెబుతున్నారు. అయితే 2వేల నోట్ల రద్దు ప్రక్రీయ చాలా మంచిదని, పేదవారికి న్యాయం చేసినట్లు ఉంటుందని, అవినీతి, అక్రమాలను తగ్గించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీకి పచ్చజెండా