అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు:పువ్వాళ్ళ
సంకల్ప దీక్షలో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు:పువ్వాళ్ళ
== సంకల్ప దీక్షలో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
(కూసుమంచి-విజయం న్యూస్)
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అపడం లాంటిదేనని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అన్నారు.
ఇది కూడా చదవండి:- రాహుల్ అభినవ భగత్ సింగ్ – మాజీమంత్రి సంభాని
ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో పాలేరు నియోజకవర్గ స్థాయి సంకల్ప దీక్షలో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ దోపిడీని,వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నది ఎంత వాస్తవమో,ఈ దేశం కోసం, దేశ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కి ఆయన్ను ఆపాలనుకోవటం మీ తరం, ఎవరితరం కాదన్నారు.ప్రశ్నించే గొంతులను కేంద్రంలోని భాజపా సర్కార్ నొక్కుతోందని ప్రజాసమస్యలపై,ప్రభుత్వ విధానాలపై పార్లమెంటులో గళమెత్తే రాహుల్‌గాంధీని సభనుంచి వెళ్లగొట్టారని పార్లమెంటులో
ప్రతిపక్షాలను ప్రభుత్వం అణిచివేస్తే ప్రజల్లోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు పంటకు గిట్టుబాటు ధర: సంభాని
రాహుల్.. బలహీనవర్గాలకు వ్యతిరేకమనే ముద్ర వేయడం దారుణమని.. లలిత్ మోదీ.. నీరవ్‌మోదీ.. వీరంతా బలహీనవర్గాల వారా అని ప్రశ్నించారు…