Telugu News

పెట్రోల్ బంక్ లో కార్ దగ్దం.

?కార్ ఓనర్, ఫిల్లింగ్ స్టేషన్ సిబ్బంది అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

0

పెట్రోల్ బంక్ లో కార్ దగ్దం

?కార్ ఓనర్, ఫిల్లింగ్ స్టేషన్ సిబ్బంది అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల సారపాక నందు గల అంజలి ఫిల్లింగ్ స్టేషన్ నందు సుమారు సోమవారం ఉదయం 5:20 నిll సమయం లో కార్ నందు ప్రమాద వశాత్తూ చెలరేగిన మంటలు. సదరు కార్ లోని వ్యక్తులు చెప్పిన సమచారం ప్రకారం సారపాక లో నివాసం ఉండే పొలసాని ఆది రెడ్డి

also read :-ముచ్చర్ల క్రాస్ రోడ్ లో చోరీ
అమెజాన్ కెమికల్ కంపెనీ కి సంబందించిన AP 5 CW 9120 నంబర్ గల షిఫ్ట్ విడిఐ కారు పెట్రోల్ కొట్టించుకోటానికి వచ్చి తిరిగి వెళ్ళే సమయం లో హెడ్ లైట్ వద్ద వచ్చిన స్పార్క్స్ వల్ల చెలరేగిన మంటలు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ బంక్ లో పనిచేసే వారు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా విఫలం కావడం తో అందరూ కలసి కారును బంకుకు దూరంగా నెట్టి వేసినట్టు తెలిపారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటన లో ఎవరికీ ప్రమాదం సంభవించ లేదు.