Telugu News

ఎమ్మెల్సీ కవితను విచారించిన సీబీఐ

ఏడున్నర గంటలపాటు విచారణ.. ఏం జరిగిందంటే..?

0

ఎమ్మెల్సీ కవితను విచారించిన సీబీఐ

== ఏడున్నర గంటలపాటు విచారణ

== ప్రగతిభవన్ కు వెళ్లిన కవిత

(హైదరాబాద్‌-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ కుమార్తే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆదివారం  సీబీఐ  విచారణ చేసింది.  దిల్లీ మద్యం కుంబకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ఆరోపణలు రాగా, ఆమెకు ఇటీవలే సీబీఐ నోటీసు జారీ చేసింది. ఈనెల 4 లేదా 5న విచారణ చేయాల్సి ఉండగా కవిత కొన్ని ముందే నిర్ణయించిన కార్యక్రమాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని, వీలుంటే ఈనెల 11, 12, 14, 16న అందుబాటులో ఉంటానని  సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి తెలంగాణ క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు

ఈ కేసుకు సంబంధించి కవిత ఇంట్లోనే సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. రెండు బృందాల్లో వచ్చిన సీబీఐ అధికారులు.. సుమారు ఏడున్నర గంటలపాటు విచారించి ఆమె నుంచి వివరాలు సేకరించారు. సీఆర్‌పీసీ 160 కింద కవితను సాక్షిగా మాత్రమే విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్టు సమాచారం. ముందుగా తెలిపిన సమాచారం మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. వారిలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారని అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ అంశంపైనే ఎక్కువగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈకేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆమెను సాక్షిగా మాత్రమే విచారించారు. ఇంతటి విచారణ పూర్తయిందా? లేక మరోసారి కవితను విచారాస్తారా? అనే దానిపై సీబీఐ అధికారుల నుంచి ఇంకా స్పష్టత రాలేదు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత నివాసం వద్దకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా చేరుకున్నారు.

== ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

సీబీఐ సుదీర్ఘ విచారణ అనంతరం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఎమ్మెల్సీ కవిత తన అడ్వికెట్ తో మాట్లాడారు. సుమారు అరగంట పాటు చర్చలు జరగాయి. అలాగే  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా కవితతో సమావేశమయ్యారు. అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె కార్యకర్తలకు అభివాదం చేశారు. తర్వాత మంత్రి తలసానితో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఉదయం నుంచి జరిగిన సీబీఐ విచారణ, తదితర పరిణామాలను కవిత సీఎం కేసీఆర్‌కు వివరించనున్నట్టు సమాచారం.

ఇది కూడా చదవండి కోమటిరెడ్డి లేకుండానే..? అందులో నోచాన్స్