Telugu News

అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో మేడే వారోత్సవాలను జరపండి: సీపీఎం

సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

0

అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో మేడే వారోత్సవాలను జరపండి: సీపీఎం

== అరుణ పతాకాలను ఆవిష్కరించండి!

==  సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

ఖమ్మం, ఏప్రిల్‌ 29(విజయంన్యూస్):

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 137వ ‘‘మేడే’’ వారోత్సవాలను ఖమ్మం జిల్లాలో పార్టీ శాఖ ఉన్న అన్ని గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్‌ వార్డులలో జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రామిక వర్గానికి కొండంత అండగా ఉండే ఎర్ర జెండాలను వీధి వీధిన ఆవిష్కరించాలని ఆయన కోరారు. నేడు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి, లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్పొరేట్లకు అధికారాలను కట్టబెడుతున్నారని, పేదలపైన భారాలు మోపి, కార్పొరేట్‌ దోపిడీదారులకు రాయితీలు యిస్తున్న విధానాలను ఎండగట్టాలన్నారు.

ఇది కూడా చదవండి: పువ్వాడ ను కలిసిన తమ్మినేని..ఎందుకోసమంటే..?

మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కులం`మతం పేరుతో కార్మిక వర్గాన్ని, ప్రజలను విడదీసే కుట్రలను కార్మికులు తిప్పికొట్టాలన్నారు. కార్మికులు, రైతు కూలీల ఐక్యతతోనే బిజెపి దోపిడీ పాలనను అంతం చేయాలన్నారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికుల రక్తంతోనే ఎర్రజెండా ఆవిర్భవించిందన్నారు. మేడే పేరుతో శ్రమ జీవుల జెండా అయిన ఎర్ర జెండాను కాకుండా, రకరకాల జెండాలు ఆవిష్కరించి కార్మికవర్గాన్ని అవమానించటాన్ని కార్మికులు నిరసించాలన్నారు. అన్ని రకాల దోపిడీల నుండి ప్రజలను, కార్మిక వర్గాన్ని విముక్తి చేయగలిగేది మేడే కార్మిక వీరులు తమ రక్తంతో ఆవిష్కరించిన ఎర్రజెండా మాత్రమేనని, ఆ స్ఫూర్తితో మేడేను జరపాలని నున్నా విజ్ఞప్తి చేశారు. శనివారం జిల్లా సెంటర్‌లో వున్న పార్టీ జిల్లా బాధ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రం, సోషల్‌ మీడియా రాష్ట్ర బాధ్యులు పిట్టల రవి, పార్టీ జిల్లా కమిటి సభ్యులు పి.రaాన్సీ, నవీన్‌రెడ్డి, ఆర్‌.ప్రకాష్‌ నాయకులు కొండలు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ‘పాలేరు’ బరిలో తమ్మినేని