Telugu News

స్మార్ట్ కిడ్జ్”లో వేడుకగా వసంత పంచమి., 

ఖమ్మం, 

0

స్మార్ట్ కిడ్జ్”లో వేడుకగా వసంత పంచమి.

ఖమ్మం, 

స్థానిక స్మార్ట్ కిడ్జ్ స్కూల్ లో శనివారం వసంత పంచమి పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. పాఠశాలలో సరస్వతి మాత చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సరస్వతి మాత అందరికీ అక్షర జ్ఞానాన్ని కలిగించాలని చిన్నారులు మొక్కులు చెల్లించారు.నర్సరీ చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చిన్నారులు విశేషరీతిలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

also read;-రాజీవ్ స్వగృహ ను కార్పొరేట్ సంస్థలకు అప్పగించొద్దు

వసంత పంచమి ప్రత్యేక పర్వదినం విద్యార్థులకు విజ్ఞాన కాంతులు అందించాలని స్మార్ట్ కిడ్జ్ కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణచైతన్య తెలియజేశారు.

చదువుల తల్లి సరస్వతీ మాత కరుణ కటాక్షాలు విద్యార్థులందరికీ ఉత్తమ చదువులను అందించాలని , విద్యార్థులకు దీవెనలు ఇవ్వాలని సరస్వతీ మాతను కోరుకున్నారు.
విద్యలో అంచెలంచెలుగా ఎదిగి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు గౌరవం తీసుకొని రావాలని చింత నిప్పు కృష్ణ చైతన్య విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.