Telugu News

కేంద్రంపై సమరమే

* నేడు జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు

0

కేంద్రంపై సమరమే
** నేడు జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు
** గ్రామగ్రామాన చావుడప్పులు, దిష్టిబొమ్మల దగ్ధం, ర్యాలీలు
** విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి పువ్వాడ
(ఖమ్మం ప్రతినిధి- విజయంన్యూస్):-
ధాన్యం సేకరణంలో కేంద్రం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమర శంఖం ఊదారు. గత కొద్ది రోజుల క్రితం నియోజకవర్గ కేంద్రంలో రోడ్లదిగ్భందనంకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ ఈనెల 20 నుంచి వరసగా కేంద్రంపై నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసేందుకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సిద్దమైయ్యారు.

గ్రామగ్రామాన ర్యాలీలు, నిరసనలు, చావు డప్పువాయిద్యాలు, దిష్టిబొమ్మలతో ఊరేగింపులు, దిష్టిబొమ్మదగ్ధం కార్యక్రమాలను నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్దమైయ్యారు. ఖమ్మం నగరంలో, అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా, ఖమ్మంలో జరిగే నిరసన కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ, నూతన ఎమ్మెల్సీ తాతామధుసూధన్, వివిధ కమిటీ చైర్మన్లు హాజరవుతున్నారు.

అలాగే కూసుమంచిలో జరిగే నిరసనకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, సత్తుపల్లిలో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెంలో వనమా రాఘవేంద్ర, జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, మధిరలో జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు, మణుగూరులో జరిగే కార్యక్రమానికి ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు, వైరాలో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే రాములు నాయక్, ఇల్లందులో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే హరిప్రియ, భద్రాచలంలో జరిగే కార్యక్రమానిక ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ,అశ్వరరావుపేటలో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
గ్రామ గ్రామాన నిర‌స‌న కార్‌రక్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయండి
◆ రాష్ట్ర రవాణా శాఖ. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు.
ధాన్యం సేక‌ర‌ణ‌లో కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ సోమ‌వారం గ్రామ గ్రామాన నిర‌స‌న కార్య‌క్ర‌మాలు, చావు డ‌ప్పులు ర్యాలీలు, ఊరేగింపులు నిర్వ‌హించి నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు ప్ర‌తి గ్రామంలో నిర‌స‌న కార్య‌క్ర‌మం జ‌రిగే విధంగా జిల్లాలోని ఆయా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయ‌కులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని మంత్రి పువ్వాడ సూచించారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతాంగానికి చేయూతనిస్తూ వ్యవసాయం పండుగగా మారే విధంగా చేశార‌ని, ఉచిత విద్యుత్‌, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పుష్కలంగా సాగునీరు, రైతు బంధు, సకాలంలో ఎరువులు, విత్తనాలు దొరికే విధంగా చేశార‌న్నారు. లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయ‌ని, రాష్ట్రంలో పంట దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. వానాకాలం వడ్ల కొనుగోలు విషయంలో అస్పష్టమైన, గందరగోళం చేస్తూ, అయోమయపరుస్తుంద‌ని వారి ఆరోపించారు. మంత్రుల బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రుల నిల‌దిస్తామ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి, ఆందోళనకు గురిచేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరు,వాడలో చావు డప్పు కార్యక్రమంలో పాల్గొన‌డానికి రైతులు సిద్ధంగా ఉన్నార‌న్నారు.

also read :-గజ్జెల రామారావు కుటుంబానికి న్యాయం చేయాలి