Telugu News

కేంద్రం సంచలన నిర్ణయం..

ఆ పథకం కింద చేసే పనులకి డైరెక్టుగా చెల్లింపులు..!!

0

కేంద్రం సంచలన నిర్ణయం..

—ఆ పథకం కింద చేసే పనులకి డైరెక్టుగా చెల్లింపులు..!!

(విజయం న్యూస్):-

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005వ సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి 100 రోజుల పని కల్పించడం ఈ పథకం ఉద్దేశ్యం.దీనిని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తుంది. అయితే ఇటీవల ఈ పథకం కింద చాలా అవకతవకలు జరిగినట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఇందులో మార్పులు చేయడం ప్రారంభించింది. తాజాగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద చేసే పనులకు ఇకనుంచి కేంద్ర ప్రభుత్వమే నేరుగా బిల్లులు చెల్లించనుంది. రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీలతో సంబంధం లేకుండా నిర్మాణ సామగ్రి సరఫరాదారుల (వెండర్‌) ఖాతాల్లోకి బిల్లు మొత్తాలు జమ చేయనుంది. కూలీలతో చేయించే పనుల నుంచి గ్రామాల్లో నిర్మాణ పనులకు బిల్లుల చెల్లింపుల వరకు అన్నిటిని మార్చేసింది. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) రూపొందించిన పోర్టల్‌లో అన్ని వివరాలూ డైరెక్ట్‌గా అప్‌లోడ్‌ చేయాలి. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో ఈ పోర్టల్‌ పని చేస్తుంది. ఈ కొత్త వ్యవస్థ వచ్చాక ఈ పథకంలో అనేక మార్పులు జరుగుతున్నాయి.

also read :-బహుజనులకు రాజ్యాధికారం తథ్యం

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ‘ఉపాధి’ పథకం మెటీరియల్‌ పనులకు నిర్మాణ సామగ్రి సరఫరాదారుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అధికారులు చేపట్టారు. పంచాయతీలు తీర్మానం చేసిన పనులకు వీరు సిమెంట్‌, ఇసుక, ఇనుము, కంకర వంటి సామగ్రి సరఫరా చేస్తారు. పూర్తయిన పనులకు ఇంజినీర్లు లెక్కలు కట్టి బిల్లులు తయారు చేసి ఎన్‌ఐసీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఆ మొత్తాలను కేంద్రం నేరుగా సరఫరాదారు ఖాతాలో జమ చేస్తుంది.

also read :-రిలయన్స్ స్మార్ట్ లో కరెంట్ షాక్ తో యువకుడు మృతి

కేంద్రం ఈ నిర్ణయంతో సర్పంచుల జోక్యానికి కూడా అడ్డుకట్ట పడింది. ఉపాధి హామీ పథకంలో పంచాయతీల ఆధ్వర్యంలో రహదారులు, కాలువలు, భవన నిర్మాణ పనులు చేస్తారు. వీటిని గుర్తించడం, తీర్మానం చేసి మండల ఇంజినీర్లకు పంపడంలో సర్పంచులు కీలకంగా వ్యవహరిస్తారు. దీంతో సర్పంచులు తమకు కావలసిన వ్యక్తులను నిర్మాణ సామగ్రి సరఫరాదారుగా చూపించి వారితో పనులు చేయిస్తారు. పూర్తయ్యాక వారి పేర్లుతో బిల్లులు చెల్లిస్తుంటారు. అయితే ఇకనుంచి పనులకు తీర్మానం చేయడం, అవి పూర్తయ్యాక నిర్ధారించడం వరకే సర్పంచులు చేయాలి. బిల్లుల విషయంలో జోక్యం చేసుకోరాదు.