Telugu News

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలి:ఎమ్మెల్యే సండ్ర

ధాన్యం బస్తాలను నెత్తిన పెట్టుకొని నిరసన ర్యాలి.

0

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలి:ఎమ్మెల్యే సండ్ర

ధాన్యం బస్తాలను నెత్తిన పెట్టుకొని నిరసన ర్యాలి.

మోడీ శవ యాత్ర,దిష్టి బొమ్మ దగ్ధం.

(తల్లాడ విజయం న్యూస్):-
ఖమ్మం జిల్లా తల్లాడలో సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్ర ప్రభుత్వంపై నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న రైతులు వ్యతిరేక విధానాలు ఎండగడుతూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తల్లాడ మండలం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్లబండ్లకు మోడీ దిష్టిబొమ్మతో ప్రధాన రహదారిలో ఎమ్మెల్యే తల్లాడ మండలం నాయకులు నల్ల చొక్కాలు ధరించి ధాన్యం బస్తాలు తలమీద పెట్టుకో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపిస్తోందని రైతుల సంక్షేమాన్ని,రైతుల మనుగడను గాలికి వదిలేసి పబ్బం పడుతుంది, కేంద్ర ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని ప్రాంతాల వారీగా విభజించి పాలిస్తున్నారు,

ఉత్తరప్రదేశ్, పంజాబ్ రైతులకు ఒక న్యాయం తెలంగాణ రైతులకు ఒక న్యాయమా, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల రైతులు సమన్యాయం ఎందుకు చూపించడం లేదని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ప్రకటన నిలబెట్టుకోవాలని వానాకాలం పంటలు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ఇచ్చిన వాగ్దానం, చేసిన హామీలు నెరవేర్చాలని, హైదరాబాద్ లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన గడువు పూర్త ఆయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతులకు అండగా ఈ ఆందోళనలు చేపడుతున్నామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు అయినా ఇంతవరకు ఎందుకు ఒక్క ఎఫ్ సి ఐ గుడం ఎందుకు నిర్మించలేదు,అసలు ఎఫ్ సి ఐ ఎందుకు పనిచేస్తుందని ప్రశ్నించారు.

allso read :- డప్పు వాయించిన మంత్రి అజయ్.

స్వయానా రాష్ట్ర సీఎం ధర్నా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు, పార్లమెంటు సాక్షిగా ఎంపీలు నిరసనలు తెలిపిన ఎమ్మెల్యేలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం విభజించు పాలించు పద్ధతిని అవలంబిస్తుదని ఈ ప్రక్రియను మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలని లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి చేస్తామని తెలిపారు. దాన్యం కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే రాష్ట్ర ప్రభుత్వానిది కాదు, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయకర్తగా మాత్రమే పని చేస్తుందని రైతుల సంక్షేమం ద్రుష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.

మండల అధ్యక్షుడు వీర మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి రైతుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని మోడీ శవయాత్ర నిర్వహిస్తున్నామని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి దాన్యం సేకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, మండల టిఆర్ఎస్ అధ్యక్షులు వీర మోహన్ రెడ్డి, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారపోగు వెంకట్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కోటారెడ్డి, వైరా మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి భద్ర రాజు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు వెంకట్ లాల్, అంబేద్కర్ నగర్ సర్పంచ్ జొన్నలగడ్డ కిరణ్ బాబు, యువజన సంఘం నాయకులు దూపాటి నరేష్ రాజ్, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

also read;-ఢిల్లీల్లో… కేంద్రాన్ని నిల‌దీసి… నిగ్గ‌దీస్తాం : ఎంపీ నామా