Telugu News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు..

-ధాన్యం కొనుగోలు విషయంలో కుట్రపూరిత చర్యలు

0

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు..
-ధాన్యం కొనుగోలు విషయంలో కుట్రపూరిత చర్యలు
-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాయల నాగేశ్వరరావు

నేలకొండపల్లి, డిశంబర్, 22 : ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ రైతులతో ఆటలాడుతూ తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాయల నాగేశ్వరరావు ఆరోపించారు. బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోట్ల మంది ఆధారపడిన వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే డ్రామా లాడుతున్నాయన్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను బలిచేసేలా నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. మోదీ, కేసీఆర్‌పై పెరుగుతున్న అసంతృప్తిని బయటకు కనిపించనీయకుండా కూడబలుక్కుని ఆందోళనలు చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్న వారే ఆందోళనలు చేస్తే ధాన్యం ఎవరు కొంటారని ప్రశ్నించారు.

దేశంలో అన్నీ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, రైళ్లు, విమానాలు, బిస్ఎన్ఎల్, ఎల్ఐసి లాంటి ప్రదానమైన వ్యవస్థలన్నీ కార్పోరేట్ల చేతికి చిక్కిన తర్వాత ఇప్పుడు కోట్లాది మంది ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగాన్ని కూడా బడా బాబులకు కట్టపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారధోరణితో ప్రవర్తిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రామసహాయం మాధవరెడ్డి, జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, నేలకొండపల్లి సర్పంచ్ రాయపూడి నవీన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు బచ్చలకూరి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ నాయకులు జెర్రిపోతుల సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి జెర్రిపోతుల అంజిని, ఎంపిటిసి కట్టెకోల సుదాకర్, నాయకులు ఈవూరి శ్రీనివాసరెడ్డి, కుక్కల హనుమంతరావు, రేగూరి హనుమంతరావు, పెద్దపాక ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :-కాట శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ…