Telugu News

రైతు ఆత్మహత్యలకు కేంద్ర ,రాష్ట్ర

ప్రభుత్వాలే బాధ్యత వహించాలి

0

రైతు ఆత్మహత్యలకు కేంద్ర ,రాష్ట్ర
ప్రభుత్వాలే బాధ్యత వహించాలి

* రాష్ట్ర మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి

(కామేపల్లి – విజయం న్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని
రాష్ట్ర మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నెమలిపురి గ్రామంలో అప్పుల బాధతో మృతి చెందిన భూక్య వాగ్య కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అప్పులబాధతో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.వైరస్, నల్లి వల్ల ఈఏడాది మిర్చి పంట సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం బాధిత రైతు కుటుంబానికి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్, సూర్యపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గింజలు నరసింహ రెడ్డి, ఎంపిటిసి రాం రెడ్డి జగన్నాథరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాం రెడ్డి గోపాల్ రెడ్డి,క్రిష్ణారెడ్డి,మద్దినేని రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రనాయక్ డాక్టర్ రవి, మోహన్ నాయక్, భాష నాయక్,దేవండ్ల రామకృష్ణ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

also read :-ఖమ్మంలో సి.పి.ఐ ఎర్ర కవాత్