నెల్లిపాక సోసైటీలో సీఈఓ సస్పెండ్
== రూ.20లక్షల దుర్వినియోగం
== విచారణ చేపట్టిన డీసీఓ వెంకటేశ్వర్లు
== సీఈఓ రామారావుని సస్పెండ్ చేసిన పాలకవర్గం
(అశ్వాపురం/మణుగూరు-విజయం న్యూస్)
అశ్వాపురం మండలం పరిధిలోని నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహాకర పరపతి సంఘంలో అక్రమాల పర్వం బట్టబయలైంది.. డైరెక్టర్ల ఫిర్యాదుతో విజయం పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు చేపట్టారు. జిల్లా కోఆపరేట్ అధికారి వెంకటేశ్వర్లు నెల్లిపాక సోసైటీలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టగా సుమారు రూ.20లక్షలు అక్రమాలు దుర్వినియోగం అయినట్లు తెలడంతో సోసైటీలో సీఈవోగా పనిచేస్తున్న రామారావును బాధ్యుడిగా చేస్తూ డీసీఓ సస్పెండ్ చేశారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: నెల్లిపాక సోసైటీలో అక్రమాలు
మండల పరిధిలోని నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ప్రస్తుత పాలకవర్గంలో 2021-22 ఏడాదిలో అక్రమాలు, దుర్వినియోగం జరిగినట్లుగా కొందరు డైరెక్టర్లు అనుమానించారు. దీనిపై సీఈవో రామారావును వివరాలు అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడంతో ఇటీవలే ఆధారాలతో సహా డైరెక్టర్లు ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు. ఈ విషయంపై విజయం తెలుగు దినపత్రికలో ‘నెల్లిపాక సోసైటీలో అక్రమాలు’ అంటూ వార్త ప్రచురితమైంది.దీంతో స్పందించిన జిల్లా సహాకర అధికారి వెంకటేశ్వర్లు గురువారం నెల్లిపాక సోసైటీలో విచారణ చేపట్టారు. గతంలో ఎంత ఆధాయం వచ్చింది. ఖర్చుల వివరాలను, 2021-22 అడిట్ రిపోర్టను పరిశీలించారు. దీంతో ఆడిట్లో రూ.20 లక్షలు దుర్వినియోగం అవకతవకలు జరిగినట్లుగా నిర్థారించారు. రూ.15లక్షలు సీఈవో రామారావు లెక్కలు చూపించకపోగా, రూ.5లక్షలను చైర్మన్ లెక్కలు చూపించలేదన్నట్లుగా తెలింది.
ఇదికూడా చదవండి: కమాన్ గుసగుస.. ?!
దీంతో నిధులకు సంబంధించిన అంశాల్లో బాధ్యుడిగా సంఘం సీఈవో రామారావును సస్పెండ్ చేస్తూ గురువారం జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు ప్రకటించగా, సంఘం పాలకవర్గం తీర్మానం చేశారు. సంఘం తాత్కాలిక సీఈఓ గా కార్యాలయం లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న వెంకట్ కు బాధ్యతలు అప్పగిస్తూ పాలకవర్గం తీర్మానం చేశారు. ఈ విషయంపై సీఈఓ రామారావును వివరణ కోరగా సంఘం డబ్బులు అక్రమాలు, దుర్వినియోగం చేయలేదని, కోర్టు విషయాలకు, ఇతర పనులకు వినియోగించడం జరిగిందని, ఎక్కడ కూడా రూపాయి దుర్వినియోగం చేయలేదని, కావాలనే కొందరు మాపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. కచ్చితంగా నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ తుక్కాని మధు సూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ కమటం సురేష్, తొమ్మిది మంది డైరెక్టర్లు పాల్గొన్నారు.