Telugu News

జిల్లాలో ‘చడ్డీ గ్యాంగ్’  తిరుగుతోంది: తాతామధు

పొంగులేటిపై మండిపడిన ఎమ్మెల్సీ తాతామధు, ఎమ్మెల్యే సండ్ర

0

జిల్లాలో ‘చడ్డీ గ్యాంగ్’  తిరుగుతోంది: తాతామధు

== దిశదశ లేని ముసుగు వీరులు తిరుగుతున్నరు

== తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం వారి నైజం

== పెయిడేడ్ పెయిడ్ అర్టీస్టులతో సీఎంపై విమ్మర్శలు చేస్తున్నారు

== సీఎం కేసీఆర్ చరిత్ర మాసిపోయేది కాదు

== తెలంగాణ మాటను ఉచ్చరించే నైతిక హక్కులేదు

== పొంగులేటిపై మండిపడిన ఎమ్మెల్సీ తాతామధు, ఎమ్మెల్యే సండ్ర

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

జిల్లాలో దశదిశలేని చడ్డి గ్యాంగ్ ఒక్కటి తిరుగుతుందని, ఆ గ్యాంగ్ పట్ల ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతామధుసూదన్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్  మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేందుకు ప్రధానమైన కారణం బిజెపి నాయకులే‌ వారే తెలంగాణను సాధించారా..? అంటూ వ్యాఖ్యానించిన శ్రీనివాస్ రెడ్డికి ఏమాత్రమైన సిగ్గుందా? అని ప్రశ్నించారు.

ఇదికూడా చదవండి: కేసీఅర్ నీ గద్దె దింపే దమ్ము నీకుందా: మంత్రి పువ్వాడ

తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎటువంటి వ్యాఖ్యలైన చేస్తారా ?అని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నతమైన వ్యక్తిపై నిందలు వేసే స్థాయి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి లేదంటూ హెచ్చరించారు. పేడ్ ఆర్టిస్టులతో ముఖ్యమంత్రి కెసిఆర్ పై, బిఆర్ఎస్ ప్రభుత్వం పై, బిఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్న శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్తులో అంతకంత అనుభవించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీపై, ముఖ్యమంత్రి కెసిఆర్ పై అవాకులు చావాకులు పేలుతున్న ఈ చౌకబారు నాయకులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు శాశ్వతంగా చరమగీతం పాడనున్నారని తెలిపారు. టీడీపీ నుంచి వచ్చినోళ్లకు పదవులిచ్చార పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారని, మీరే పార్టీలో నుంచి వచ్చారో తెలుసా..? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినోళ్లకే కదా సీఎం కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చింది, మీ నాయకులే కదా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసింది. మరీ ఇప్పుడేందుకు ఆ మాటలోస్తున్నాయని అన్నారు.  పులితోలు కప్పుకున్నంతమాత్రన పులి అవుతారా..? నీకు ఉన్నదేంటి..? డబ్బులుతప్పా.. అని విమ్మర్శించారు. సీఎం కేసీఆర్ ఏం అన్యాయం చేసిండు అని పదేపదే అనడం హస్యాస్పదంగా ఉందని, అందరికంటే అప్యాయంగా చూసుకున్నది నిన్నోక్కడ్నే అని గుర్తు చేశారు. కానీ తిన్నింటి వాసాలు లెక్కపెట్టావు అంటూ పొంగులేటిపై ద్వజమెత్తారు.

ఇదికూడా చదవండి: ఖమ్మంలో కుక్కల దాడికి బాలుడు మృతి

అసరా ఇచ్చిన సీఎం కేసీఆర్ పై పెయిడేడ్ పెయిడ్ అర్టిస్టులతో విమ్మర్శలు చేయిస్తున్నారని, అది మానుకొండి.. లేకుండా బుద్ది చెబుతామని హెచ్చరించారు. పాలేరు నియోజకవర్గంలో జరిగిన సభలో మాట్లాడుతూ మేము బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యం అంటూ ప్రకటించారని, ఈ లక్ష్యం 2018లోనే నేరవేరింది కదా..? అనిప్రశ్నించారు. పార్టీ బీఆర్ఎస్.. ఓట్లేయించేంది కాంగ్రెస్ కంటూ విమ్మర్శించారు.నీకు దమ్ముంటే 2023లో ఒంటిరగా పోటీ చేయాలని ప్రశ్నించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాలలో బిఆర్ఎస్ పార్టీ విజయ డంకా మోగించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ: సత్తుపల్లి నియోజకవర్గం వేదికగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ, గత కొద్ది రోజులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తున్న వ్యవహార శైలితో శ్రీనివాస్ రెడ్డి పై నమ్మకం పెట్టుకున్న నాయకులు అయోమయానికి గురవుతున్నారని, ఒంటరిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని తన ఆర్థిక బలంతో ఢీకొనాలని పగటి కలలు కంటున్న శ్రీనివాస్ రెడ్డి ఏ అర్హత తో ప్రజా క్షేత్రంలో పోరాడుతారని ప్రశ్నించారు. కేవలం తనకున్న ఆర్థిక బలంతోనే రాజకీయాలు చేస్తున్నారని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్న గుర్తింపు ఏమిటో చెప్పగలరా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన సంక్షేమ పథకాలతో అభివృద్ధిని అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎలా పడితే అలా నోరు ఉంది కదా అని మాట్లాడుకుంటూ పోతే ఊరికినే ప్రసక్తే లేదని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ఏ వ్యక్తి అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు పథకానికి, షాదీ ముబారక్- కళ్యాణ లక్ష్మి పథకానికి, ఆసరా పింఛన్ లకి, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అద్భుతమైన పథకాలకు వ్యతిరేకులగా జిల్లావాసులు భావిస్తున్నారని, జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమం ఏమిటో తెలుసుకోవాలని శ్రీనివాస్ రెడ్డికి ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు.

ఇదికూడా చదవండి: ఖమ్మంలో ‘రష్మీ’ సందడి

శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరిన కూడా బిఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ మాట్లాడుతూ: మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అంతరాత్మని ప్రశ్నించుకోవాలని  హితవు పలికారు. 75 ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా దళితుల గురించి ఆలోచించిందా ? అని ప్రశ్నించారు. యావత్ భారత దేశంలోనే దళితుల కోసం ఎవరైనా ఆలోచించారా? ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆత్మగౌరవం కు అర్థం పట్టే విధంగా దళిత బంధువు కార్యక్రమానికి శ్రీకారం చుట్టూతే అది చూసి ఓరువని కొంతమంది మతిభ్రమించి ఇలా మాట్లాడడం దళితులపై వారికున్న ఆలోచనలకు నిదర్శనమని తెలిపారు. రానున్న సావిత్రిగా ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఖమ్మం జిల్లాలోని దళితులంతా బ్రహ్మరథ పట్టి తమ హక్కును చేర్చుకోబోతున్నామని తెలిపారు. కేవలం దళితులు ప్రాధాన్యత ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గం ప్రయత్నం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి సరైన సమయంలో సరైన విధంగా జిల్లా ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ: సత్తుపల్లి నియోజకవర్గం లో ఆత్మీయ సమ్మేళనం లో మాట్లాడిన మువ్వ విజయ్ వ్యాఖ్యలు వింటే నవ్వొస్తుందని తెలిపారు, తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన కల్వకుంట్ల కవితమ్మ పై మాట్లాడే అర్హత డిసిసిబి బ్యాంక్ ని అడ్డం పెట్టుకొని అక్రమాలు చేసిన మువ్వ విజయ్ బాబుకు ఉందా ? ఘాటుగా ప్రశ్నించారు.

ఇదికూడా చదవండి: Go.no 58, 59 ను పొడిగిస్తూన్నాం:మంత్రి పువ్వాడ

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వచ్చిన ఆరోపణలు ఎందుకు వచ్చాయో ? యావత్ దేశ ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు కూడా తెలుసునని, అలాగే జిల్లా ప్రజలకు గతంలో మువ్వ విజయ్ బాబు డిసిసిబి బ్యాంకులో చేసిన అవినీతి భాగవతం ఏమిటో కూడా జిల్లా ప్రజలకు తెలుసనని తెలిపారు. స్థాయిని మించిన వ్యాఖ్యలు చేస్తే ప్రజలు స్వాగతిస్తారు అనుకోవడం మూర్ఖత్వమేనని, ఇకనైనా హుందాతనంతో వ్యవహరిస్తూ మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉమామహేశ్వరరావు, జిల్లా రైతు సమితి  సమన్వయ అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వర్లు, జిల్లా యువజన అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమర్ తదితరులు పాల్గొన్నారు.