Telugu News

చౌటపల్లి వాగులో చిక్కుకున్న ట్రాక్టర్

గడ్డి తీసుకుని వస్తుండగా ఒక్కసారిగా పెరిగిన వరద

0

చౌటపల్లి వాగులో చిక్కుకున్న ట్రాక్టర్

— గడ్డి తీసుకుని వస్తుండగా ఒక్కసారిగా పెరిగిన వరద

— స్పందించిన అధికారులు.. స్థానికుల సహాయంతో బయటకు 

(కూసుమంచి-విజయంన్యూస్)

అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నారు.. వర్షాలు దండిగా కురుస్తున్నాయి.. వరదలు ఉదృత్తంగా వస్తున్నాయి.. నీళ్ళలోపలకు వెళ్ల వద్దు.. రోడ్లపై వరద వస్తుంటే దాటే ప్రయత్నం చేయోద్దని జిల్లా కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారుల వరకు వందల సార్లు మొత్తుకుంటున్నారు.. పేపర్లలో ప్రకటనలు వస్తున్నాయి.. గ్రామస్థాయిలో పోలీసులు అవగాహణ కల్పిస్తున్నారు.. అయినప్పటికి మారతారా..? లేదు.. నేనే పెద్ద ..? అని వాగులను దాటే ప్రయత్నం చేస్తారు.. అదే జరిగింది కూసుమంచి మండలంలోని చౌటపల్లి గ్రామంలో.  అదే గ్రామానికి చెందిన ఓ రైతు తన ట్రాక్టర్ తీసుకుని పంట చేల వరకు వెళ్లి గడ్డి మోపులు వేసుకుని తిరిగి ఇంటికి వస్తున్నాడు.  అటు వైపుగా వెళ్ళినప్పుడు వరద లేకపోవడంతో వెళ్ళి తిరిగి వస్తుండగా రో్డ్డుపైకి వరద వచ్చింది. కొద్ది వరదేగా అని భావించిన ఆ రైతు వరదను దాటే ప్రయత్నం చేయగా, ట్రాక్టర్ వాగులో చిక్కుకుంది.  కాగా ఆయన పెద్ద అరుపులు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.

ఇది కూడా చూడగలరు : వణికిస్తున్న “గులాబ్”

— స్పందించిన అధికారులు 

చౌటపల్లి గ్రామంలోని వాగులో ట్రాక్టర్ అలాగే డ్రైవర్ చిక్కుకోగా విషయం తెలుసుకున్న కూసుమంచి తహసీల్దార్ శిరీషా, కూసుమంచి ఎస్ఐ నంధీప్ తక్షణమే తమ సిబ్బందని అక్కడకి పంపించారు. వెంటనే స్థానికులు సహాయంతో మరో ట్రాక్టర్కు తాడు కట్ఠి బయటకు లాగారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. బయటకు వచ్చిన రైతుపై స్థానికులు, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.