Telugu News

చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శం: మంత్రి పువ్వాడ

ఘనంగా నివాళ్లు అర్పించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

0

చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శం: మంత్రి పువ్వాడ

== ఘనంగా నివాళ్లు అర్పించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం, సెప్టెంబర్ 10(విజయంన్యూస్):

 తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) వర్ధంతి సందర్భంగా రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆదివారం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాం పాలనకు, విసునూరు దేశ్‌ముఖ్ పాల‌న‌కు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె అనాడు చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యింద‌ని మంత్రి అన్నారు. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ.. ఆనాటి దేశ్‌ముఖ్‌లు, రజాకార్ల గుండెల్లో దడ పుట్టించాయ‌న్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో నలు దిక్కుల అభివృద్ది చేసి:మంత్రి పువ్వాడ

ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే మరోవైపు అమ్మలా ఉద్యమకారులకు అన్నం పెట్టిన‌ మహనీయురాలు ఐల‌మ్మ అని మంత్రి పువ్వాడ కీర్తించారు.  ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆర్జేసి కృష్ణ, కార్పొరేటర్ లు బిజి. క్లెమెంట్, దండా జ్యోతి రెడ్డి, పగడాల నాగరాజు, అమర గాని వెంకన్న, ఎస్కె షకీన, తాజుద్దీన్, టి. బ్రహ్మం, మేకల సుగుణారావు, రెగళ్ల కొండల్ రావు, శ్రీలక్ష్మి, ఎన్. శ్రీనివాసరావు, కణతాల నర్సింహరావు, మేకల సుగుణ రావు, జక్కుల వెంకట రమణ, కనతాల నరసింహారావు, పేళ్లురి విజయ్ కుమార్, సిద్దా సాహెబ్, చిక్కుళ్ళు నాని, ఎం.  సుగుణ, కుదురుపాక నర్సయ్య, బీసీ సంఘాల నాయకులు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి. జ్యోతి, డివిజన్ ఆఫీసర్ ఈదయ్య, ఏవో మాధవి, బిసి వెల్ఫేర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

== వీరనారి ఐలమ్మ పొరాట స్పూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలి : నున్నా నాగేశ్వరరావు

ఖమ్మం:   తెలంగాణ సాయుధపోరాట యోధురాలు వీరనారి అమరజీవి చిట్యాల ఐలమ్మ 38వ వర్ధంతి సభ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ని సుందరయ్య భవన్‌లో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్.ప్రకాష్ అద్యక్షతన జరిగింది.ముందుగా ఐలమ్మ చిత్రపటానికి నున్నా నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళ్ళరించారు. ఆనంతరం జరిగిన సభ లో సిపిఎం జిల్లా కార్యదర్శి  నున్నా నాగేశ్వర రావు హజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన చారిత్రిక ఉద్యమంలో 4వేల మంది అసువులు బాశారని, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ పాలకుర్తి గ్రామంలో విసునూరు దొరకు వ్యతిరేకంగా తన కౌలు భూమి రక్షణ కోసం ఆంధ్ర మహాసభ లో చేరి, విస్నూరు దొరకు వ్యతిరేకంగా వీరోచితంగా కమ్యూనిస్టు పార్టీ సహకారంతో పోరాడిరదని, ఐలమ్మ పోరాటం పేద ప్రజలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నేటి పాలకులు ఆనాడు సాధించినటువంటి భూసంస్కరణల చట్టాన్ని 70 ఏళ్ల కాలంలో తుంగలో తొక్కారని విమర్శించారు. నేటికీ తెలంగాణ ప్రాంతంలో బడుగు బలహీనవర్గాల పైన అణచివేత, దోపిడీ సాగుతుందని, దీనికి వ్యతిరేకంగా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గా పోరాటాలు చేయడమే ఆమెకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పోన్నం వెంకటేశ్వరరావు,యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి,రాష్ట్ర నాయకులు యం.సుబ్బారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, బండి రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్‌, మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, విష్ణు,బషీర్‌, శీలం నర్సింహ రావు, నాయకులు భూక్యా శ్రీను,టీ.యల్.నర్సయ్య, మాచర్ల గోపాల్, విప్లవకుమార్,డాక్టర్ భారవి,యస్‌.కె. అఫ్జల్,మెరుగు రమణ,బేగం, జె.నాగేశ్వరరావు, భాగం అజిత,నాదెండ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.