Telugu News

ఖమ్మం ‘ఛాంబర్’లో కేసు కలకలం

ఛాంబర్ ప్రముఖులపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం..?

0

ఖమ్మం ‘ఛాంబర్’లో కేసు కలకలం

== ఛాంబర్ ప్రముఖులపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం..?

== రూ. కోట్ల ఆస్తులు సూడో సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్..?

== తాజా మాజీలపై ఛీటింగ్ కేసు నమోదుకు కోర్టు ఆదేశం..

==సహాకరించిన కార్పోరేటర్, రిజిస్ట్రార్ పైనా కేసు నమోదు..?

== సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కేసు వ్యవహారం

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగరంలో ఛాంబర్ ఆస్తుల మార్పిడి బాగోతం సంచలనం రేపుతోంది.. ఈనెల 6న ఛాంబర్ కు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కోర్టు తీర్పు సంచలనంగా మారింది.. తాజా మాజీలపై ఛిటింగ్ కేసులు నమోదు చేయాలని, వారికి సహాకరించిన కార్పోరేటర్, రిజిస్ట్రార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు  త్రీటౌన్ పోలీసులకు ఆదేశించినట్లుగా ఒక పోస్టింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. అసలు కేసు నమోదు చేశారో లేదో..? కానీ ఆ పోస్టింగ్ మాత్రం తెగ హాడాహుడి చేస్తోంది.. దీంతో ఖమ్మం నగరంలో సంచలనంగా మారింది.

ఇది కూడా చదవంఢి : బంగ్లాపై భారత్ ఘనవిజయం

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో తీవ్ర కలకలం.. ఛాంబర్ తాజా మాజీ అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని క్రిష్ణారావు, గొడవర్తి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నగర నేత కమర్తపు మురళి, సొసైటీ రిజిస్ట్రార్ లపైనేగాక మరికొందరిపై ఛీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం.  ఈనెల 6వ తేదీన ఛాంబర్ కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతున్న రూ. కోట్ల ఆస్తుల మార్పిడి కేసు. వివరాల్లోకి వెళితే 1939లో ఖమ్మం పట్టణంలో అన్ని రకాల వ్యాపారులందరు ఐక్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సమావేశమైయ్యారు. ఆసమయంలో ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నానరు. తెలంగాణా రాష్ట్రంలోనే అతి ప్రాచీన వర్తక శ్రేణుల సంఘంగా ఇది గుర్తింపు కలిగి ఉంది.కాగా  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1963లో అప్పటి ప్రముఖ వ్యాపార వేత్తలు ఓ తీర్మానం చేసి తాము ఏర్పాటు చేసుకున్న సంఘానికి చట్ట రూపం ఇవ్వడానికి తీర్మానం చేశారు. ఆయా తీర్మాణాల్లో సొసైటీ రిజిష్ట్రార్ హైదరాబాద్ ఆఫీసుకు పంపగా, బైలా నెం. 1/65 ప్రకారం ‘ది ఖమ్మం మర్చంట్స్ అసోసియేషన్’ పేరుతో సంఘాన్ని స్థాపించారు. ఈ సంస్థ ఏర్పాటులో అప్పటి వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు, సోషల్ వర్కర్లు దాదాపు 19 మంది ఉన్నారు. వీరిలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కాంగ్రెస్ నాయకుడు గెల్లా కేశరావు, కోన పట్టాభి, పుల్లఖండం వెంకన్న, రాయపూడి నారాయణరావు తదితరులు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: మునుగోడు లో కేటీఆర్ రోడ్డు షోలో జనమే జనం

ది ఖమ్మం మర్చంట్స్ అసోసియేషన్ కు ప్రస్తుత ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం సహా అనేక ఇతర స్థిర, చరాస్తులు ఉన్నాయి. వీటి విలువ రూ. కోట్లలో ఉంటుంది. బైలా నెం. 1/65 ప్రకారం వివిధ వ్యాపార సంస్థలు ది ఖమ్మం మర్చంట్స్ అసోసియేషన్ కింది పనిచేస్తున్నాయి. అయితే దాదాపు 1,175 మంది సభ్యులతో చివరిసారిగా 2019లో ప్రముఖ ఆడిటర్ వీవీ అప్పారావు నేతృత్వంలో ఛాంబర్ కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా చిన్ని క్రిష్ణారావు, గొడవర్తి శ్రీనివాసరావులు ఎన్నికయ్యారు. వ్యాపార అనుభవం లేని సుమారు 19 మందితో మార్చి 4వ తేదీన నిబంధనలకు వ్యతిరేకంగా మరో కొత్త సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ‘ది ఛాంబర్ ఆఫ్ కామర్స్’ అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ సంస్థను బైలా నెం. 26/2022 ప్రకారం ‘ది ఖమ్మం మర్చంట్స్ అసోసియేషన్’ స్థానంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ గా వ్యవహరిస్తూ సొసైటీ రిజిస్ట్రార్ తో రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తుత సభ్యులు ఛాంబర్ నాయకులను నిలదీయగా సమాధానం చెప్పకుండా బైలా నెం.  26/22 అనే నిబంధనను అమలు చేయడానికి సమాయత్తమైనట్లు సమాచారం. ఈమేరకు బైలా నెం. 1/65 పేరున గల ఆస్తులను బైలా నెం. 26/22 పేరు మీద ఉన్నట్లుగా రిజిస్ట్రేషన్ పొంది, సుమారు రూ. 25 లక్షల నగదు దగ్గర ఉంచుకుని అడిగినవారికి సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు సమాచారం.  ఈ కారణంగా ది ఖమ్మం మర్చంట్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్న వ్యాపారి వెగ్గళం శ్రీనివాసరావు అధికారులకు వినతి పత్రం సమర్పించినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వెగ్గళం శ్రీనివాసరావు కోర్టును ఆశ్రయించారు. ఇక్కడ షూరు అయ్యింది అసలు సమస్య..

ఇది కూడా చదవంఢి: కూసుమంచిలో రోడ్డు ప్రమాదాలు

ఈమేరకు కోర్టు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులైనవారిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని బుధవారం ఖమ్మం త్రీ టౌన్ పోలీసులను ఆదేశించింది. ఈమేరకు ఖమ్మం ఛాంబర్ ఆప్ కామర్స్ తాజా మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిన్ని క్రిష్ణారావు, గొడవర్తి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకుడు కమర్తపు మురళి, సొసైటీ రిజిస్ట్రార్ తదితరులపై ఐపీసీ 420, 465, 406, 409, 419 రెడ్ విత్ 23, 34 సెక్షన్ల కింది కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఖమ్మం ప్రిన్సిపల్ మూడో అదనపు కోర్టు జడ్జి కుమారి పూజిత ఆదేశించారు. ఈనెల 6వ తేదీన ఖమ్మం ఛాంబర్ కు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఛీటింగ్ కేసు వ్యాపార, వర్తక సంఘ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

== ఛీటింగ్ నమోదు చేయమని చెప్పినవారే పోటీలో..?

ఈనెల 6న ఖమ్మం వర్తకసంఘం ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రీయ పూర్తయ్యింది.. కొంత మంది ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. కాగా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులకు తీవ్రపోటీ ఉంది.. త్రీముఖ పోటీ జరుగుతుంది. అధ్యక్ష రేసులో చిన్నిక్రిష్ణారావు, కొప్పుల కోటేశ్వరరావు, కొదుమూరి మధుసూదన్ రావు పోటీలో ఉండగా ప్రధాన కార్యదర్శి రేసులో బాదే రమేస్, గొడవర్తి శ్రీనివాస్ రావు, మెంతుల శ్రీశైలం పోటీలో ఉన్నారు.  అయితే ప్రస్తుతం తాజా మాజీ అధ్యక్షులు చిన్నిక్రిష్ణారావు, ప్రధాన కార్యదర్శి గొడవర్తి శ్రీనివాస్ రావులపై కోర్టు ఛీటింగ్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కాగా వారు ఈఎన్నికలకు అర్హులైనా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. ఏదేమైనప్పటికి కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఖమ్మం వర్తక సంఘంలో పెనుమార్పులకు సవాల్ గా మారాయనే చెప్పాలి.