Telugu News

మార్కెట్ లో మోసం అనేదే లేదు :చిన్నిక్రిష్ణారావు

ఓటమి జీర్ణించుకోలేక కొందరు తప్పుడు ప్రచారం

0

మార్కెట్ లో మోసం అనేదే లేదు

== ఓటమి జీర్ణించుకోలేక కొందరు తప్పుడు ప్రచారం

== ఖమ్మం మార్కెట్ ను బద్నాం చేసే పనులు చేస్తున్నారు

==  మిర్చియార్డులో ఆర్డీ అనే ప్రసక్తే లేదు

== విలేకర్ల సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్నిక్రిష్ణారావు

‘(ఖమ్మంప్రతినిధి, నవంబర్ 17(విజయంన్యూస్)

ఖమ్మం మార్కెట్ లో మోసం అనేదే లేదని, రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తున్నామని, వ్యాపారులందరు రైతుల పక్షాన నిలుస్తున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్నిక్రిష్ణారావు అన్నారు. గురువారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి మెంతుల శ్రీశైలం, దిగుమతిశాఖ అధ్యక్షుడు దిరిశాల వెంకటేశ్వరరావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంత మంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో పోటీ చేసి ఓటమి చెందిన వారు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పై తప్పుడు ఆరోపణలు  చేస్తున్నారని ఆరోపించారు.

allso read- ఖమ్మం మార్కెట్ లో మాయాజాలం

ఖమ్మం మార్కెట్ కు ఎంతో మంచి పేరు ఉందని, ఆ పేరును చెడగొట్టడానికి మార్కెట్ లో తప్పుడు ప్రచారాలు చేస్తూ వ్యాపారులను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దిగుమతిశాఖ ఎన్నికలలో జనరల్ సెక్రటరీగా పోటీ చేసి మూడవ స్థానానికి పరిమితమైన యర్రా అప్పారావు ఓటమిని జీర్ణించుకోలేక అనేక ఎత్తుగడలకు, తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నగర వ్యవసాయ మార్కెట్ కు తెలంగాణలోనే  ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. కొద్ది రోజుల క్రితం మార్కెట్ ఆధాయం విషయంలో రాష్ట్రంలోనే రెండవ స్థానం సాధించిందన్నారు. అలాంటి మంచి పేరు ఉన్న మార్కెట్ పై యర్రా అప్పారావు, ఆయనతో కలిసి ఉండే సభ్యులు ఆసత్య ఆరోపణలు చేయడమే కాకుండా తోటి వ్యాపారులపై ఆసభ్య పదజాలం వాడటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఓటమి నాటి నుంచి సోషల్ మీడియాలో నేరుగా వ్యాపారులకు పోన్లు చేసి అసభ్య పదజాలం ఉపయోగిస్తూ తిట్టడం జరుగుతుందన్నారు. చివరి వర్తక సంఘాన్ని తప్పుడు ప్రకటనలతో బద్నాం చేసే కుట్రలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. యర్రా సోదరులతో పాటు వారి వెనక ఉండి నడిపించే వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోనీయ్యకుండా అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ వారిపై కూలంకుశంగా చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మిర్చి ఖరీదుదారులు ఆర్డీ రూపంలో పంటను తరలిస్తున్నారని చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అలాంటిది ఏమైనా జరిగితే మార్కట్ కమిటీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని, మిర్చి యార్డ్ లో గురువారం జరిగిన సంఘటన పట్ల బాధపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షుడు సోమ నరేష్, సహాయ కార్యదర్శి మన్నెం క్రిష్ణ, కోశాధికారి తల్లాడ రమేష్, దిగుమతి శాఖ ప్రధాన కార్యదర్శి ముత్యం ఉప్పలరావు, మిర్చిశాఖ అధ్యక్షుడు మాటేటి నాగేశ్వరరావు తదితరులు హాజరైయ్యారు.

ఇది కూడా చదవంఢి: పదికి పదే లక్ష్యంగా పనిచేద్దాం :మంత్రి పువ్వాడ