Telugu News

నేడు ఖమ్మంలో ‘చంద్ర’ గర్జన

భారీ జన సమీకరణ కోసం నేతల కసరత్తు

0

నేడు ఖమ్మంలో ‘చంద్ర’ గర్జన

== నలుగురు సీఎంలు, మాజీ సీఎం రాకా

== సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డి.రాజా  తో పాటు కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శులు హాజరు

== హైదరాబాద్ కు చేరుకున్న సీఎంలు, మాజీ సీఎం

== నేడు ఉదయం ప్రస్తుత రాజకీయాలపై చర్చ

== ఉదయం 10గంటలకు రెండు హెలికాప్టర్లలో యాదాద్రికి

== మధ్యాహ్నం 2గంటలకు ఖమ్మం కలెక్టరేట్ కు

== బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సర్వం సిద్దం

== భారీ జన సమీకరణ కోసం నేతల కసరత్తు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం జిల్లాకు కల్వకుంట్ల చంద్రశేఖరుడు రానే వస్తున్నారు..భారత రాజకీయాలపై గర్జించేందుకు వస్తున్నాడు.  ఆయనతో పాటు తోటి ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులను వెంటపెట్టుకుని వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాజకీయాల్లోకి వెళ్లాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు మూలమైన బీఆర్ఎస్ పార్టీ  తొలి బహిరంగ సభను ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్నారు. అందుకు గాను ఈ సభకు సంబంధించిన భారీ ఏర్పాట్లు చేస్తుండగా, ఆ ఏర్పాట్లన్ని పూర్తి చేసుకుని బహిరంగ సభకు సర్వం సిద్దమైయ్యింది. భారీ హోర్డింగ్ లు, తోరణాలతో పాటు నేతల కటౌట్లు, ర హదారులకు రెండు వైపుల జెండాలు, తోరణాలతో ఖమ్మం నగరం గులాబీ మయమైంది.

allso read- ఇల్లెందులో ట్రెండింగ్ నేత ‘సంజీవ్’

ఈ సభకు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జీల్లాలలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మహుబూబాబా, సూర్యపేట జిల్లాలలోని ఆరు నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ కార్యకర్తలను తరలించేందుకు ఏర్పట్లు చేస్తున్నారు. గ్రామాల్లోకి వాహనాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు పాదయాత్ర చేసేందుకు సిద్దమైయ్యారు. పాదయాత్ర ద్వారా వేదిక వద్దకు రావాలని నిర్ణయం తీసుకున్నారు.

== చంద్రుడు గర్జిస్తారా..?
ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీ, ఛత్తీస్ గడ్, ఓడిశా రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఖమ్మం జిల్లా నుంచి జాతీయ రాజకీయలకు ‘సింహ గర్జన’ కాదుకాదు.. ‘చంద్ర గర్జన’ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం నగరం నుంచే రాబోయే ఎన్నికలకు సైరన్ మోగించనున్నారు. సమర శంఖం పూరించనున్నారు. దేశంలో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నయం అని చూపించుకునేందుకు బలప్రదర్శన జరుగుతోందన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమేంటి..? ఆ పార్టీ భవిష్యత్ లో ఏం చేయబోతుంది..?

allso read- పొద్దుపొద్దుగలే గ్రౌండ్లో మంత్రులు

ఏ పార్టీలను కలుపుకునేందుకు ప్రయత్నం చేస్తుంది..? ఏ రాజకీయ పార్టీలకు పుల్ స్టాఫ్ పెట్టే ప్రయత్నం జరుగుతోందనే విషయాలను సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా బీజేపీ పార్టీని ఎలా ఎదుర్కోవాలో కూడా కార్యకర్తలకు దిశనిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు ఉంది.  రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల మంది జన సమీకరణ కోసం అన్ని నియోజకర్గాల్లోని జనం ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల నుంచి బహిరంగ సభకు వచ్చే జనాలు ఇబ్బందులు కల్గించకుండా 100 ఎకరాల్లో బహిరంగ సభ స్థలం, 228 ఎకరాల్లో పార్కింగ్ స్ళలాలు, 1000 మంది వాలంటీర్లు 100 ముబైల్స్ టాయిలెట్స్, 8లక్షల మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 50ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి ఏ ఒక్కరికి ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

== నలుగురు సీఎంలు, కీలక నేతలు హాజరు

ఖమ్మం జిల్లాకు నలుగురు సీఎంలు నేడు హాజరువుతున్నారు.  సీఎం కేసీఆర్ తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖీలేష్ యాదవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు నేడు ఖమ్మం జిల్లాకు రానున్నారు.

allso read- మేమే నెంబర్ వన్: సీఎం కేసీఆర్

ఈనెల 17న తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రులు, సీఎం కేసీఆర్ తో కలిసి తన ఇంట్లో బ్రేక్ పాస్ట్ చేసి, అక్కడ నుంచి సమీక్ష చేసుకుని, ఆ తరువాత రెండు హెలికాప్టర్ల ద్వారా యాద్రాద్రికి రానున్నారు. అక్కడ దేవాలయం నిర్మాణం, వాటి ప్రత్యేకతల గురించి తెలియజేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు భోజనం విరామం అనంతరం అక్కడ నుంచి ఖమ్మం కలెక్టరేట్  వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో అక్కడ దిగిన తరువాత నేరుగా కలెక్టర్ భవనం వద్దకు వెళ్లి అక్కడ ఆ భవనాన్ని ప్రారంభిచనున్నారు. అనంతరం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి, అక్కడ నుంచి నేరుగా సభావేదిక వద్దకు చేరుకోనున్నారు.సభావేదిక పై కేవలం ముఖ్యఅతిథిగా వచ్చిన కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయ్ మాట్లాడిన తరువాత మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆ తరువాత భగవంత్ మాన్, క్రేజివాల్ మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ చివరి వ్యాఖ్యకర్తగా మాట్లాడనున్నారు. మొత్తం ఖమ్మం జిల్లాలో 2గంటల నుంచి 4.30 గంటల వరకు బహిరంగ సభ జరగనుంది. ఈ సభ అనంతరం తెలంగాణ సంప్రదాయం ప్రతిబింబించాల పోచంపల్లి, నారాయణ పేటలో తయారు చేసేన శాలువలతో సీఎం కేసీఆర్ అతిథులకు సత్కారం చేయనున్నారు. అనంతరం కరీం నగర్ కళాకారులు రూపొందించిన సిల్వర్ ఫిలిగ్రి వీణఒక్కోక్కరికి జ్జాపికను అందించనున్నారు. అనంతరం ప్రత్యేకంగా తెప్పించిన బాణాసంచాను పెల్చనున్నట్లు తెలిపారు.

allso read- భద్రాద్రికి తోడుగా సీఎం కేసీఆర్ : మంత్రి