Telugu News

“అభివృద్ధి ని వివరించన చంద్రబాబు-తలపించిన ప్రధాత తుమ్మల”

లోడిగ వెంకన్నయాదావ్ సామాజిక వేత్త. పాలేరు

0

“అభివృద్ధి ని వివరించన చంద్రబాబు-తలపించిన ప్రధాత తుమ్మల”

== లోడిగ వెంకన్నయాదావ్ సామాజిక వేత్త. పాలేరు

ఖమ్మం-విజయంన్యూస్)

సుదీర్ఘ కాలం ఎనిమిది సంవత్సరాల తర్వత మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు బహిరంగ సభ  ఖమ్మంలో అశేష జనవాహిని తో ఖమ్మం పురవీధులు పులకించేలా విజయ శంఖారావం మోగించారు. సభానిర్వహకులు కూడ ఇంతగా ఊహించి ఉండరు. ఇదంతా ఒక ఎత్తుఅయితే సభను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు అభివృద్ధి మంత్రం జపించి సభికులను ఆకట్టుకొన్నారు. ఏఒక్క రాజకీయ విమర్శ లేకుండా ఇరువై ఐదు సంవత్సరాల క్రింతం తాను వేసిన అభివృద్ధి పునాదులు నేడు ఫలితాలు ఇస్తున్నాయి అది నాకు తృప్తిని ఇచ్ఛింది. దానిని కొనసాగింపు గానే నేడు మీ ముందు నిలబడ్డాను అన్నప్పుడు ప్రజల్లో చప్పట్లు మారు మోగాయి.

ఇది కూడా చదవండి: బాబు నీ రుబాబు ఇక్కడ నడవది: మంత్రి పువ్వాడ

ఒక్కొక్కటిగా అభివృద్ధి ని చంద్రబాబు చెపుకొంటు పోతున్న ప్రతీ మాటలో తుమ్మల తలపించింది. ఈరోజు నేను ఖమ్మం వస్తుంటే సూర్యాపేట నుండి ఖమ్మం హైవే మీద ఆనందం కలిగింది. ఎందుకంటే  ఆనాడు దేశంలో లోనే మొట్టమొదటి సారి హైవే రహదారి రూపకల్పన చేసింది నేనే దానికి ఆనాటి పునాది నేడు కొనసాగింపు అన్నారు.అంతేకాదు హైదరాబాద్ లో అంర్జాతీయ విమానశ్రయం, రింగు రోడ్డు లు ,బైపాస్ రోడ్లకు శ్రీకారం చుట్టాంఅన్నారు. అప్పుడు రోడ్లు భవనాల శాఖ మంత్రి గా ఉన్న శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి మారుమూల ప్రాతాలను సైతం లింకు రోడ్లుగా మార్చి అప్పుడే అభివృద్ధి ప్రధాతగా నామకరణం సార్థకత చేసుకొన్నారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు ను చూస్తే బీఆర్ఎస్ కు భయం పట్టుకుంది: కూరపాటి

ఖమ్మం పట్టణ స్థిరీకరణ, ఖమ్మం జిల్లా అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వానికి సాద్యమైంది తమ్ముళ్లు అన్నప్పుడు సభసప్పట్లతో ధ్వనీకరించింది. భద్రాచలం మునిగిపోకుండా దూరద్రుష్టితో గోదావరి 50 అడుగుల నీటి మట్టం దాటినా భద్రాచలంనకు సీతారామచంద్ర మూర్తి ఆలయానికి ముప్పు లేకుండా 50 కోట్లరూపాయల  నిధులతో  వరధ నివారణ కరకట్టకు శ్రీకారం చుట్టాము.అదే చేయకుంటే మొన్న వచ్ఛిన వరదలకు భద్రాచలం ఉండేదా తమ్ముళ్లు అన్నప్పుడు సభలో ఆనందంతో కేకలు వేశారు సభ సప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర,అధికారుల మేధా సంపత్తిని క్రోడీకరించి నిధులను సేకరించి భారీ నీటి పారుదల శాఖా మంత్రి గా ఈకరకట్ట లో విశేష మైన కృషి తుమ్మల నాగేశ్వరరావు గారిది ఎంతో ఉంది. ఎందుకంటే స్వయాన వరదలు వచ్ఛినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో స్వయంగా తుమ్మల దూరద్రుష్టి ,దార్శనికత గురించి కేసీఆర్ కొనియాడారు. ఆనాడు తమ్మల కరకట్ట నిర్మాణం చేసిఉండక పోతే ఈనాడు భద్రాచలం మనకు దక్కేది కాదు అనటం చంద్రబాబు మాటలకు సభ సప్పట్లతో తుమ్మలను తలపించింది.

ఇది కూడ చదవండి: తెలంగాణకు తెలుగుదేశం అవసరం: చంద్రబాబు

ఈజిల్లా మైనర్ ఇరిగేషన్ తో రైతాంగం కొరకు అనేక నీటిపారుదల చిన్నకారు సన్నకారు శ్రీకారం చుట్టాం దుమ్ముగూడెం ,చెక్ డ్యామ్ ములతో చెరువులకు, లిఫ్ట్ ల ద్వారా వ్యవసాయ సాగుకు  ఖమ్మంలో చేపట్టిన నీటిపారుదల గురించి వివరించిన తీరులో వెంటనే సభలో కొందరు తుమ్మలను గుర్తుచేసుకొన్నారు. కేంద్రనిధుల తో పాటు ప్రపంచ నిధులను సమీకరించి చిన్ననీటి పారుదల శాఖామంత్రి గా సాగునీరు కొరకు అనేక లిఫ్ట్ లు త్రాగు నీరు కోసం ప్రతీ ఊరిలో వాటర్ ట్యాంక్ లు నిర్మాణం కొరకు తుమ్మల ఖమ్మం జిల్లాను ఒక మోడల్ గా రాష్ట్రంలో నిపిన ఘనత తుమ్మలకు దక్కుతుంది. ఇట్టి విషయాలో సభలో ప్రతీఒక్కరు అభివృద్ధి గురించి చెపుతుంటే అభివృద్ధి ప్రదాత తుమ్మలను గుర్తు చేసుకొన్నారు.

ఇలా ప్రతీ అంశములో కూడ చంద్రబాబు మాటలకు తుమ్మల చేతలకు పోలికలు గుర్తుకు రాకనే గుర్తుకు వచ్ఛాయి. తెలగుదేశం అధికారం కొసం కాదు అభివృద్ధి కొరకు పాటు పడింది. ఓటు రాజకీయల కొరకు ఏనాడూ నేను పనిచేయలేదు విజన్ తో పనిచేసి 2020 లక్ష్యంగా పనిచేశా ఈనాడు ఈ ఫలితాలు చూసి మిమ్మల్ని చూశాక నాకు తృప్తి ని ఇచ్ఛింది.నా పనితనం 25నాటి పునాది మరో 25 ఏళ్ళ కోసం నేను మరల పనిచేయాలి మీ ఉత్సాహం నాకు మరింత ఉత్సాహం ఇచ్ఛింది అన్నప్పుడు సభనుండి అర్షాదిరేఖలు వినిపించాయి.ఇదే మాటలు తుమ్మల నాగేశ్వరరావు నోట  వింటుంటాం. నాకు ఏది అవసరం లేదు బ్రతికి ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేసి తృప్తి గా బ్రతకాలి అన్నదే నా లక్ష్యం అంటుంటారు తుమ్మల. పదిరూపాయలు పంచిపెట్టే రాజకీయాల కంటే పది తరాలు గుర్తు పెట్టుకొనే అభివృద్ధిని కోరుకొంటాను అంటారు. ఎందుకంటే ఈ జిల్లాలో ఒక మంత్రి యంయల్ఏ, యంయల్ సి ,యంపి లేకుండా స్వచ్ఛందంగా ప్రజలు చంద్రబాబు సభకు తరిలివచ్ఛారు అంటే కేవలం ఆనాడు చేసిన అభివృద్ధి ని చూసి వచ్ఛారు తమ్ముళ్లు అన్నప్పుడు తుమ్మల అభివృద్ధి గుర్తుకు రాక మానదు.తరచు తుమ్మల తన అనుచరుల వద్ద సీతారామ ప్రాజెక్టు పాలేరు కు తెచ్ఛి పాలేరు ప్రజల పాదాలు కడిగినేను రాజకీయ జీవితం ముగిస్తాను అంటున్న మాటలు కూడ ఈసందర్భంగా అభివృద్ధి పేరుతో గుర్తు చేసుకొంటున్నారు

ఇది కూడా చదవండి: “పంచముఖ పోరులో పాలేరు-అభివృద్ధి ని ఆకాంక్షిస్తున్న ప్రజలు”

అభివృద్ధి నే  నమ్ముకున్న తుమ్మల చంద్రబాబు అభివృద్ధి గురించి వివరించిన తీరులో తమ్మల తలపించింది. తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లాలో ఎందరినో నాయకులను తయారు చేసింది అవకాశం ఇచ్ఛింది. అన్నప్పుడు మరల మరో 25 ఏళ్ళ అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీ ని వీడిన నాయకులు తిరిగి అభివృద్ధి కొరకు తెలుగుదేశం లోకి రావాలి అన్నప్పుడు జై తమ్మల నినాదాలు వినిపించాయి.ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు సభ తుమ్మల అభివృద్ధి ని గుర్తుచేసుకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బిజెపి మూడు పార్టీల కలయిక తో తెలంగాణ లో కూడ ఇదే తరహలలో ముందు వెళ్ళే రాజకీయాలు సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే తమ్మల పాత్ర కీలకం కానుంది అని సభలో కొందరు గుసగుసలు వినిపించాయి.ఏది ఏమైనప్పటికీ ఈ సభ ద్వారా  చంద్రబాబు అభివృద్ధి మాట తుమ్మల తమ్ముళ్ల నోట మాటగా నిలిచారు.

 

లోడిగ వెంకన్నయాదావ్. సామాజిక వేత్త.పాలేరు