“చంద్రబాబు” నేడే విడుదల
== చంద్రబాబు కు బెయిల్ మంజూరు
== షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
== నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరు
== నేడు చంద్రబాబు విడుద
== ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చంద్రబాబు
== భారీ ర్యాలీ తీసేందుకు ఏర్పాట్లు
(అమరావతి-విజయం న్యూస్)
ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. స్కిల్ డెవలఫ్ మెంట్ స్కాం కేసులో 53రోజుల క్రింద జైలుకు వెళ్ళిన చంద్రబాబు బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కానీ బెయిల్ మంజూరు చేయలేదు. ఆ తర్వాత సుదీర్ఘంగా వాదోపావాదాలు చేశారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మం మార్కెట్ లో తుమ్మల ప్రచారం
– షరతులతో కూడిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను హైకోర్ట్ ఇస్తూ… విధించిన షరతులు..
– ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన కూడదు…
– కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు…
– ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది…
ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ పార్టీకి జలగం గుడ్ బై.
– చంద్రబాబుతో ఇద్దరు DSPలు ఎస్కార్ట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి..
– Z+ సెక్యూరిటీ విషయంలో… కేంద్ర నిబంధనల మేరకు అమలు చేయాలని, CBN సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్య..