Telugu News

చంద్రబాబు కు కరోనా పాజిటివ్..*

ట్విట్టర్ లో ప్రకటించిన చంద్రబాబు

0

*చంద్రబాబు కు కరోనా పాజిటివ్..*

**ట్విట్టర్ లో ప్రకటించిన చంద్రబాబు

(అమరావతి-విజయం న్యూస్)
ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనాపాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు చంద్రబాబు నాయుడు స్వయంగా తన ట్విట్టర్ లో ప్రకటించారు. తన కుమారుడు నారా లోకేష్ సోమవారం కరోనా పాజిటివ్ రావడంతో మంగళవారం తెల్లవారుజామున చంద్రబాబునాయుడు కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దీంతో ఆయనకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆయన తన ట్విట్టర్ లో ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. గత రెండు రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన ట్విట్టర్లో పిలుపునిచ్చారు. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుందని, లక్షణాలు స్వల్పంగా మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా పట్ల ప్రజలు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు

Also read:- అపోలో ఆస్పత్రిలోచేరిన భట్టి విక్రమార్క