Telugu News

చంద్రబాబు అరెస్ట్ అనైతికం: ఎన్ వి

అక్రమంగా అరెస్ట్ చేసిన చంద్రబాబు ను విడుదల చేయాలి

0

చంద్రబాబు అరెస్ట్ అనైతికం: ఎన్ వి
🔶 అక్రమంగా అరెస్ట్ చేసిన చంద్రబాబు ను విడుదల చేయాలి
👉 తెలుగుదేశం ఆఫీస్ వద్ద ఆటో డ్రైవర్ల దీక్షకు నల్లమల వెంకటేశ్వరరావు మద్దతు – సంఘీభావం

ఖమ్మం, సెప్టెంబర్ 21(విజయంన్యూస్):

 ఎలాంటి ఆధారం లేకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం అక్రమం, అనైతికమని   జిల్లా రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ  ఖమ్మంలోని పార్టీ కార్యాలయం వద్ద గురువారం  రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆటో డ్రైవర్ల శిబిరం వద్దకు నల్లమల వెళ్లి, మద్దతు, సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నల్లమల మాట్లాడుతూ  వచ్చిన ఆరోపణలపై ముందస్తు విచారణ చేయకుండా , ఎఫ్ఐ ఆర్ లో  పేరు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అన్నారు. అరెస్టు లో రాజకీయ దురుద్దేశం దాగి  ఉందని, వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని నల్లమల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని డిమాండ్  చేశారు. కార్యక్రమంలో   బీఆర్ఎస్  నాయకులు కనకమేడల సత్యనారాయణ,   చేశారు.జిల్లా  యాదవ్ సంఘం నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్  తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: నామ అంటే భరోసా !