Telugu News

చంద్రుగొండలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

** కూలీల వ్యాను నుండి కొట్టిన బొగ్గు టిప్పర్.....

0

చంద్రుగొండలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

** కూలీల వ్యాను నుండి కొట్టిన బొగ్గు టిప్పర్……..

** మృతులు ఇంకా పెరిగే అవకాశం..

(చండ్రుగొండ- విజయం న్యూస్ ):-

మండల పరిధిలోని తిప్పన పల్లి గ్రామ సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుజాత నగరానికి చెందిన కూలీలు TS 28 T 7029 నెంబర్ గల అశోక్ లేలాండ్ వాహనంలో వస్తుండగా వాహనాన్ని ఎదురుగా వస్తున్న బొగ్గు టిప్పర్ ఢీ కొట్టింది… ఈ ప్రమాదంలో లేలాండ్ వ్యాన్లు వస్తున్నా కూలీలో ముగ్గురు, కత్తి స్వాతి (26) ఎక్కిరాల సుజాత (40) గుర్రం లక్ష్మి (50)మరణించడం జరిగింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది…. వారిలో మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది… చనిపోయిన మృతుల బంధువులు జాతీయ రహదారిపై మృతదేహాన్ని పెట్టి ఆందోళన చేస్తున్నారు.. బారీగా ట్రాఫీక్ జామ్ అయ్యింది..