తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు
(విజయం న్యూస్):-
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 21న జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు మార్చాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. అటు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు.. ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు.
also read :-గురుకులసిబ్బంది అనుచిత ప్రవర్తన తో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ని పరార్
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్: ఏప్రిల్ 22న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1, ఏప్రిల్ 25న, ఇంగ్లీష్ పేపర్-1, 27న మ్యాథమెటిక్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1, 29న మేథమెటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, మే 2న ఫిజిక్స్ పేపర్-1, అర్థశాస్త్రం పేపర్-1, మే 6న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, మే 9న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు), మే 11న మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1 పరీక్షలు జరగనున్నాయి.
also read :-మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ఎలా స్కెచ్ వేశారంటే.
ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్: ఏప్రిల్ 23న 2nd లాంగ్వేజ్ పేపర్-2, 26న ఇంగ్లీష్ పేపర్-2, 28న మ్యాథమెటిక్స్ పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2, 30న మ్యాథమెటిక్స్ పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2, మే 5న ఫిజిక్స్ పేపర్-2, అర్థశాస్త్రం పేపర్-2, మే 7న కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ -2, మే 10న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు), మే 12న మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్-2 పరీక్షలను నిర్వహించనున్నారు.