తెలంగాణలో పిపుల్స్ సర్కార్ తథ్యం
== బీజేపీ, బీఆర్ఎస్ ఒక గూటి పక్షులే
== బీజేపీ క్యాపిటలిస్టుల పార్టీ.. బీఆర్ఎస్ పిడలస్ట్ పార్టీ
== దేశ సంపద క్యాప్టలిస్ట్ ల చేతిలో.. రాష్ట్ర సంపద దొరల చేతిలో బంధీ అయ్యింది
== రెండు పార్టీలు కలిసి దేశ రాజ్యంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నాయి
== వాటి ఉడత ఊపులకు తెలంగాణ ప్రజానికం తల ఊపేది లేదు
== రాబోయే కచ్చితంగా ఇందిరమ్మ రాజ్యమే
== ఈనెల 15న తెలంగాణ తల్లి, వారి కుటుంబం హైదరాబాద్ కు వస్తున్నారు
== ఈనెల17న తుక్కగూడ బహిరంగ సభకు భారీగా జనం తరలిరావాలి
== విలేకర్ల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
== విజయబేరి బహిరంగ సభను సక్సెస్ చేయాలని కోరిన అభ్జర్వర్ నసీం ఖాన్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
రాబోయే ఎన్ననికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల రాజ్యం రావడం ఖాయమని, ప్రజల రాజ్యమంటేనే ఇందిరమ్మ రాజ్యమని, కాంగ్రెస్ ప్రభుత్వ రాజ్యమని, ఆ ఇందిరమ్మ రాజ్యం రావడం ఖాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరై మాట్లాడారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్ లో గలాట
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అధినేత్రి సోనియా గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యే విజయభేరి బహిరంగ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు కదిలి రావాలని కోరారు. రాష్ట్ర ప్రజల స్థితిగతులు మార్చే విధంగా, భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా హైదరాబాదులో నిర్వహించే విజయభేరి బహిరంగ సభలో సోనియా గాంధీ ఐదు గ్యారెంటీ కార్డుతో వస్తున్నారని, ప్రజలకు మేలు చేసే ఈ ఐదు పథకాలను విజయబేరి సభలో ప్రకటిస్తారని, ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పథకాలను అమలు చేసి తీరుతామని అన్నారు. విజయభేరి బహిరంగ సభ విజయవంతం కోసం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఊరురా, బూత్ ల వారిగా సమావేశాలు నిర్వహించి బహిరంగ సభకు ప్రతి బూత్ నుంచి ప్రజలు తరలివచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు, వైఫల్యాలు, సంపద లూటీ, ఆర్థిక దోపిడీ, ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చార్జీషీట్ వేయాలని నిర్ణయించామన్నారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మం కాంగీ‘రేస్’లో ఎవరు..?
ఈ నెల 17న విజయభేరి బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రకటించే గ్యారెంటీ కార్డు ప్రకటనలను 18న సిడబ్ల్యుసి సభ్యులతో కలిసి గడప గడపకు వెళ్లి గ్యారంటీ కార్డులు పంపిణీ చేసి ప్రజలను కాంగ్రెస్ పార్టీలో మమేకం చేస్తామన్నారు. సోనియా గాంధీ ప్రకటించిన గ్యారెంటీ కార్డు ప్రకటనలు 2023- 24 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తూ.చ తప్పకుండా అమలు చేస్తామన్న భరోసా ప్రజలకు కల్పిస్తామన్నారు.
== బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు వేరు వేరు కాదు రెండు ఒకటే..
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒక్కతాను ముక్కలేనని, బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బీటీమ్ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. బిఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసినట్లేనని, ఎందుకంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో తీసుకువచ్చిన అనేక బిల్లులకు బిఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేశారని, బిజెపిని సమర్థించిన బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టుగానే అవుతుందన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం మార్చడం కోసం కుట్ర, మతాల పేరిట విభజించి దేశ సంపద, వనరులను బహుళ జాతి కంపెనీలకు దోచిపెడుతున్నదని విమ్మర్శించారు.
ఇది కూడా చదవండి:- ఓ నేత.. కార్యకర్త గోస వినవా..?
కేంద్రంలో క్యాపిటలిస్టుల కు కొమ్ముగాస్తున్న ప్రభుత్వం బిజెపి ప్రభుత్వమని, రాష్ట్రంలో పీడలిస్టుల పార్టీ బిఆర్ఎస్ అని,
క్యాపిటలిస్టులు, ప్యూడలిస్టులు దేశ ప్రజాస్వామ్యాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
== ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యం
దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందాని, ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోకపోతే సామాన్య మానవుడు జీవించే పరిస్థితి ఉండబోదని, బ్రిటీష్ పాలన మరోసారి సాధ్యమవుతుందన్నారు. బిజెపి, బిఆర్ఎస్ నుంచి కాపాడేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి:- ప్రజలను అప్రమత్తం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం: భట్టి
కాంగ్రెస్ ద్వారా దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని, ప్రభుత్వ వ్యవస్థలు, ఆస్తులు అమ్మేస్తున్న బిజెపి, ప్రభుత్వ భూములు అమ్ముతూ.. అప్పులు చేస్తున్న బిఆర్ఎస్ నుంచి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ మాత్రమే కాపాడగలుగుతుందన్నారు. అందుకే ప్రజలందరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.
== ప్రధాని కక్యసాధింపు చర్య
ప్రధాని నరేంద్ర మోడీ కక్ష్య సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పైన అక్రమ కేసు పెట్టి, జైలు శిక్ష పడేలా చేసి, పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయించి, నివాసం ఉంటున్న ఇల్లును ఖాళీ చేయించి గెంటి వేయించడం కక్ష్య సాధింపు చర్యే అని, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు సిద్ధాంత ప్రకారంగా ముందుకు వెళ్లాలి కానీ వ్యక్తిగత కక్ష్య సాధింపులకు పాల్పడటం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ఎఐసిసి, సిఈసి మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీలో చేరికలు ముందస్తుగా ప్రకటించడం వ్యూహాత్మకం కాదని, తెలంగాణలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. ప్రభుత్వ వేధింపులు నిర్బంధాన్ని ఎదుర్కొంటూ కొద్ది మంది కాంగ్రెస్ ను కాపాడుతూ వచ్చారని అన్నారు.
కాంగ్రెస్ భావ జాలాన్ని ప్రచారం చేసి బ్రతికిస్తూ వచ్చే వారికి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుందన్నారు.