Telugu News

ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్ లో గలాట

కార్యకర్తల్లో టిక్కెట్ల లొల్లి

0

ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్ లో గలాట

== కార్యకర్తల్లో టిక్కెట్ల లొల్లి

== ఇంచార్జ్ ముంగటనే హీరోయిజం

== బీసీ నినాదం ఎత్తిన హనుమంతన్న

== పొంగులేటికి టిక్కెట్ ఎట్లీస్తరన్న పోట్ల నాగేశ్వరరావు

== నేతలు సర్థిచెప్పిన వినని కార్యకర్తలు

== సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన భట్టి విక్రమార్క,  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం కాంగ్రెస్ లో గలాట జరిగింది.. కార్యకర్తలందరు తమ నేతల వద్ద హీరోయిజం చూపించే ప్రయత్నం చేశారు..  వ్యక్తిగత భజనతో అరుపులు, కేకల నడుమ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ విజయభేరి సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నాయకుడి పేరుతో పెద్దపెట్టున నినాదాలు చేశారు.

ఇది కూడా చదవండి:- తెలంగాణ తల్లి సోనియమ్మ: పొంగులేటి 

సీఎం సీఎం అంటూ కొందరు నినాదాలు చేస్తే, పొంగులేటి జిందాబాద్ అంటూ కొందరు, రాయల నాగేశ్వరరావు జిందాబాద్ అంటూ మరికొంత మంది, రేణుక చౌదరి నాయకత్వం వర్థిలాలి అంటూ మరికొంత మంది నినాదాలు చేయడంతో సన్నాహక సమావేశం కాస్తా..నినాదాల సమావేశంగా మారింది. నేతలు ఎంత మొత్తుకున్న కార్యకర్తలు, నాయకుల్లో మార్పులు రాలేదు.. నాయకులు మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తల అరుపులు,కేకలతో జిల్లా పార్టీ మీటింగ్ హాల్ దద్దరేళ్లింది.. దీంతో అరుపుల నడుమ మీటింగ్ ను నాయకులు కొనసాగించారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం కాంగీ‘రేస్’లో ఎవరు..?

     ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈనెల 17న హైదరాబాద్ లో జరిగే విజయభేరి బహిరంగ సభ సన్నాహక సమావేశం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని కాంగ్రెస్ అతిరథ మహారధులు హాజరైయ్యారు . ఏఐసీసీ నుంచి వచ్చిన కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ ఏఐసీసీ ఇంచార్జి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి , మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, భద్రాచలం ఎమ్మెల్యే పొందే వీరయ్య, ఖమ్మం జిల్లా, నగర కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గప్రసాద్, మహ్మాద్ జావిద్, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, యడవల్లి క్రిష్ణ తదితరులు హాజరైయ్యారు .. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు సమావేశాన్ని ప్రారంభించగా, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంత్ రావు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో కొంత మంది కార్యకర్తలు వీహెచ్ పై గొడవకు దిగారు. మీకేమి హక్కు ఉందని ఖమ్మంకు వస్తున్నారు, ఇక్కడ నాయకులు లేరా..? అంటూ ఓ కార్యకర్త ప్రశ్నించగా, వీహెచ్ అతని సీరియస్ అయ్యారు. ఆయన వారిస్తుండగా కార్యకర్తలు గోడవకు దిగారు. తీవ్ర వాగ్వివాదం.. స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి:- ఓ నేత.. కార్యకర్త గోస వినవా..?

గో బ్యాక్ విహెచ్ అంటూ ఓ వర్గం నినాదాలు చేశారు. మరో వర్గం ఉమ్మడి ఖమ్మంలో మూడు జనరల్ స్థానాల్లో ఒక్కటైన బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బీసీలకు అన్యాయం చేస్తున్నరని అనడంతో ఆ సమావేశం మరింత రసాభాసాగా మారింది. కార్యకర్తలు, నాయకుల మధ్య పరస్పర వాధనలు జరిగాయి. ఒక సందర్భంలో ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు .. జై భట్టి, సీఎం భట్టి, జై రాయల, జై పోట్ల, జై పొంగులేటి, లాంటి నినాదాలతో కాంగ్రెస్ కార్యాలయం దద్దరిల్లింది … హైద్రాబాద్ లో జరిగే విజయభేరి సభ కన్నా టిక్కెట్ల కోసం  ఎవరికీ లొల్లి చేయడంతో సమావేశం రసాభాసగా మారింది…వీరి ప్రవర్తన కొత్తగా కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళను కంగు తినిపించగా , పాతవాళ్ళు ఇది మాపార్టీలో సర్వసాధారణమే అంటూ కొట్టిపారేస్తున్నారు.

== 17న విజయభేరి సభ కన్నుల పండుగ జరుగుతుంది

ఈనెల 17న హైదరాబాద్ లోని తుక్కగూడలో జరిగే బహిరంగ సభ కన్నుల పండుగగా జరుగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈనెల 15,16న రెండు రోజుల పాటు హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని,  ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియగాంధీతో పాటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ, సీఎల్పీ అధ్యక్షులు హాజరువుతున్నారని అన్నారు. ఈ సమావేశం తెలంగాణలో జరగడం సంతోషకరమని, ఇది పార్టీతో పాటు తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

ఇది కూడా చదవండి:- మన్యంలో మాయగాళ్లు

ప్రజలకు ఉపయోగపడే ఐదు అద్భుతమైన పథకాలతో సోనియాగాంధీ తెలంగాణకు వస్తున్నారని, ఐదు పథకాలతో కూడిన గ్యారెంటీ కార్డుతో ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. అనంతరం ఈనెల 17న బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ సభకు 15లక్షల మంది జనం తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సభ ఉంటుందన్నారు. ఈ సభకు భారీగా జనం తరలివచ్చి విజయవంతం చేయాలని, ఈ సభను చూసిన తరువాత సీఎం కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని అన్నారు.

== కాంగ్రెస్ కి ఒక చరిత్ర ఉంది: ఆరీఫ్ ఖాన్

కాంగ్రెస్ కి ఒక చరిత్ర ఉందని, ఆ చరిత్రను చరిపితే చేడేది కాదని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు ఆరీఫ్ నసీమ్ ఖాన్ మాట్లాడుతూ … అసెంబ్లీల వారీగా సమీక్షలు ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం తీసుకుంటామన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అన్నారు.

 ఇది కూడా చదవండి:- కలిసిన ‘తుమ్మల, రాయల’.ఏం జరిగిందంటే..?

ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని టి(బి)ఆర్ఎస్ కి అధికారం కట్టబెట్టారని , పదేళ్ళ లో సీఎం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ బిజెపి కి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర కి కేసీఆర్ వచ్చాడు డబ్బుల ప్రలోభాలతో స్థానిక నేతలను‌‌ కొంటున్నాడని ఆరోపించారు.అన్ని వందల కోట్లు కేసీఆర్ కు ఎక్కడవి అని ప్రశ్నించారు.

== పార్టీని నమ్మినోళ్ల సంగతేంటి..?

మాజీ మంత్రి రేణుక మాట్లాడుతూ జిల్లాలో కొంచెం మా నేతల మనోభావాలు చేదిరాయని అన్నారు. 30, 40 ఏళ్ళు పార్టీ జెండా మోసినోళ్ళకు ప్రియార్టీ ఇవ్వలేదన్నారు. తప్పుడు సమాచారాలు, తప్పుడు నివేదికలు ఇచ్చి కొంత మందికి అన్యాయం చేశారని తెలిపారు. ఎవరు ఏం చేసినా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోటని అన్నారు. కేసులు పెట్టి వేధిస్తున్నారు.. ముస్తాఫాపై అక్రమ కేసులు పెట్టి చెంచెల గూడ జైల్లో పెట్టారు. ఖబర్దార్ మంత్రి పువ్వాడ అజయ్.. నీ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నదేవరంటే..?

పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నారని, బ్రద్రర్స్ మీరు మారండి అంటూ పోలీసులకు హితవు పలికారు. గాలి కాంగ్రెస్ వైపు మారింది.. వచ్చేది మా ప్రభుత్వమన్నారు.

== మన కుటుంబంలో గొడవలోద్దు..కలిసి పనిచేద్దాం: పొంగులేటి

ఇది మన కుటుంబం.. గొడవలు వద్దని హితవు పలికారు. పెద్దవాళ్లందరిని గౌరవించుకోవాలని మాజీ ఎంపీ పోంగులేటి శ్రీనివాస రెడ్డి కోరారు. మనం ఒక్కళ్లమే కాదు..పార్టీ అంటే అందరూ ఉండాలన్నారు. ఇది మన సభ.. ఎదో శత్రువు సభలా కోట్లాడితే ఏలా? 17న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. అధికారం వచ్చాక కోట్లాడుకుందాం..పోట్లాడుకుందా..అధికారం వచ్చిన తరువాత చూసుకుందాం ఇప్పటికే చాలా పలుచునవుతున్నాం.. పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు..