Telugu News

చర్ల లో అగ్ని ప్రమాదం

పూర్తిగా దగ్దమైన పూరిల్లు

0

చర్ల లో అగ్ని ప్రమాదం

పూర్తిగా దగ్దమైన పూరిల్లు

సుమారు లక్ష రూపాయల ఆస్థినష్టం.

చర్ల మండలం లింగాపురం గ్రామంలో బుధవారం ఉదయం ఆరు గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయగిరి నాగేంద్ర- వసుమతి దంపతులు నివసించే పూరి గుడిసె అగ్నికి ఆహుతి అయ్యింది.బాదితుల కథనం ప్రకారం వేకువ జామునే కూలి పనులకు వెల్లిన పేద కుటుంబ సభ్యులకు వారి యొక్క గూడు కాలిపోయిందని గ్రామస్థుల ద్వారా కబురు అందడంతో లబోదిబోమంటూ ఇంటికి చేరుకోగా అప్పటి కే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఉన్న పదికేజీల బియ్యం, ఐదు వేల రూపాయల నగదు,బట్టలు, దుప్పట్లు తదితర సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. నిరుపేద కుటుంబం అవడం తో రోడ్డు న పడ్డారు.ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలి అని స్థానిక ప్రజలు కోరుతున్నారు.సంఘటన స్థలాన్ని పరిశీలించి న చర్ల తాహసీల్దార్ ఈరెల్లి నాగేశ్వరరావు బాదిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అందే సహాయాన్ని సత్వరమే అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

also read :-సార్ నమస్తే మేము మీ కళాశాల విద్యార్థులం…