Telugu News

ఇంటర్ పరీక్షలు తనిఖీ

ఏన్కూరు విజయం న్యూస్

0

ఇంటర్ పరీక్షలు తనిఖీ

(ఏన్కూరు విజయం న్యూస్):-

ఏన్కూర్ లో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను గురువారం జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసింది. ఏన్కూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలుర గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో జరుగుతున్న పరీక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు ఆనంద్ బాబు తనిఖీ చేశారు. గదులన్నీ తిరిగి పరీక్షలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపర్నెంట్లు శ్రీనివాస్ రెడ్డి,సుందరం డిపార్ట్మెంట్ అధికారులు కృష్ణ ప్రసాద్,శ్రీనివాస్ పాల్గొన్నారు.