చేగొమ్మ హెచ్ ఎం సస్పెండ్
== ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
== విధుల నిర్లక్ష్యంపై హెచ్ఎంను సస్పెండ్ చేసిన కలెక్టర్
(కూసుమంచి-విజయంన్యూస్);-
ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, చేగొమ్మ ప్రధానోపాధ్యాయుడ్ని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. శనివారం కూసుమంచి మండలంలోని పలుగ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ మనఊరుమన బడి కార్యక్రమంలో భాగంగా చేగొమ్మ ఉన్నతపాఠశాలను అకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల మొత్తం కలయతిరిగారు. పాఠశాలలో సమస్యలపై ప్రధానోపాధ్యాయుడ్ని వివరణ కోరారు. ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలు చదువుతుంటే ఇలాగే ఉంచుతావా..? అని ప్రశ్నించారు.
also read :-హరితహరం మొక్కలను పట్టించుకోని అధికారులు
విద్యార్థులు తిరిగే పాఠశాలలో గోడ కూలిపోతే ఎందుకు నిర్లక్ష్యం అంటూ ప్రశ్నించారు. అనంతరం చేగొమ్మ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే మండలంలోని కూసుమంచి, జీళ్ళచెరువు ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అలాగే కూసుమంచిలోని ఫైర్ స్టేషన్ ను తనిఖీ చేశారు. పలుసూచనలు, సలహాలను అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శిరీషా, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఎంఈవో వెంకటరామాచారి, జిల్లా అధికారులు తదితరులు హాజరైయ్యారు.