Telugu News

అధ్వానంగా పల్లె రహ ‘దారిద్ర్యం’

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

0

అధ్వానంగా పల్లె రహ ‘దారిద్ర్యం’
== ప్రమాదకరంగా మారిన గ్రామీణ రోడ్లు
== దారులన్ని గుంతల మయం బురదమయం
== పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

(రిపోర్టర్ : శివనాగిరెడ్డి)
చండ్రుగొండ సెప్టెంబర్ 23 ( విజయం న్యూస్ ):-

గ్రామీణ ప్రాంతాలకు రహదారులు అభివృద్ధి కి పట్టుకొమ్మలు అని అంటారు. అలాంటి రోడ్లు మండలంలో పూర్తిగా పాడైపోయాయి. గ్రామీణ ఈ ప్రాంత అభివృద్ధికి రహదారుల మూలస్తంభంగా ఉంటాయని అంటారు. కానీ గ్రామీణ రహదారులు పూర్తిగా అధ్వానంగా మారాయి. అడుగేస్తే మడుగు అనే అంతలా పరిస్థితి ఉంది. అక్కడ రోడ్డు ఉందా అనిపించే దారులు మండలం లో లెక్కలేనన్ని ఉన్నాయి. రోడ్డు నిర్మాణం, మరమ్మతులపై పాలకులు ఇచ్చిన హామీలు గాలిలో కలిశాయి. ఒకవైపు కంకర తేలిన రోడ్లు, మరోవైపు గుంతల రోడ్లు, ఇంకోవైపు బురద రోడ్లు మండలంలో ఏ దారిలో వె

ళ్లిన ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రహదారులు ప్రమాదకరంగా మారాయి.

ఇది కూడా చదవండి: ఏఐసీసీ అధ్యక్షడు ఎవరు..?

ఇటీవల కురిసిన వర్షాలకు మరింత అధ్వానంగా తయారయ్యాయి. పల్లె ప్రగతి అంటూ ప్రభుత్వం నిర్వహించిన రోడ్ల పరిస్థితి లో మాత్రం మార్పు లేదు. కొంత రోడ్లపై ప్రయాణం నరకంగామారింది. రోడ్లపై నుంచి ప్రజా ప్రతినిధులు, అధికారులు వెళ్తున్న వాటిని మరమ్మతు గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్ళితే…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయి. గుంతలు పడి కంకర రాళ్లు తేలి ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రహదారుల విషయంపై అధికారులకు, నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. పోకలగూడెం నుంచి గానుగపాడు , మద్దుకూరు నుండి , బాలికుట , బెండాలపాడు నుండి పోకలగూడెం, చండ్రుగొండ నుండి గుర్రం గూడెం, తిప్పన పల్లి నుండి రేపల్లె వాడ వరకు రహదారులు గుంతలు పడి కంకర రాళ్లు తేలాయి.

ఇది కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో మరో సూది హత్య

ఈ రోడ్లు భారీగా దెబ్బతిని ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు అనేక ఇ్బబందులు పడుతున్నారు. గుంటలు పడి, కంకర తేలి ఇబ్బందిగా ఉందని అధికారులకు తెలిపినా పట్టించుకోవడంలేదని ప్రజలు పేర్కొంటున్నారు. రాత్రివేళ వాహనాలపై వెళ్లాలంటే భయమేస్తుందని వాహనదారులు చెబుతున్నారు. ఎన్నోసార్లు కిందపడి గాయాలయ్యాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు స్పందన కార్యక్రమాల్లో ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చామని, రోడ్ల గురించి ఇప్పటి వరకు స్పందన లేదని వాహనదారులు పేర్కొంటున్నారు. పాఠశాలలకు, కళాశాలలకు గ్రామీణ విద్యార్థులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దారుల్లో కొంతదూరం వెళ్తే ఒళ్ళు గుల్ల అవుతుంది. ఏ కాస్త ఆదమరచిన గోతుల్లో పడి కాళ్లు, చేతులు విరుగుతున్నాయి. ఇక గర్భిణులు ఆస్పత్రుల కి వెళ్లాలంటే ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయపడాల్సిస్తోంది. నరకానికి దారుల కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి గ్రామీణ రహదారులను బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

== పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు
మండలంలో గ్రామీణ రోడ్లు అద్వానంగా ఉన్నా, పాలకులు, అధికార యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల సమయంలో నాయకులు ఓట్ల కోసం మీ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీలు గుప్పించిన ఎన్నికల అనంతరం పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామీణ రోడ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా మారింది. దీంతో ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గత సంవత్సర కాలంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఈ దారి గుండా ప్రయాణించిన కానీ ఈ రోడ్లకు మోక్షం కలగడం లేదు.