Telugu News

గల్లీ (కో ) బెల్ట్ దుకాణం…

పల్లెల్లో బార్లను తలపిస్తున్న బెల్టుషాపులు..

0

గల్లీ (కో ) బెల్ట్ దుకాణం…
== పల్లెల్లో బార్లను తలపిస్తున్న బెల్టుషాపులు..
== ఆదాయమే లక్ష్యంగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం…
== గుల్ల అవుతున్న మద్యం ప్రియులు జేబులు..
== చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖా ధికారులు…
చండ్రుగొండ సెప్టెంబర్ 2( విజయం న్యూస్ ):- 

గ్రామాల్లో గల్లీకో బెల్ట్ షాపు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు సాగిస్తున్నారు.. అయినా కూడా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు మాకు ఏమీ సంబంధం లేనట్టుగా, చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. బెల్ట్ షాపుల నిర్వహణ వల్ల రిటైల్ మద్యం షాపుల వ్యాపారాలకు అడ్డగోలుగా లాభాలు వస్తున్నాయి.
పల్లెల్లో బెల్టుషాపులు దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాల్లో రాత్రింబవళ్లు మత్తులో జోగుతున్న యి. గ్రామాలు, తండాలలో పుట్టగొడుగుల్లా బెల్టుషాపులు వెలుస్తున్నాయి.

ALLSO READ- తెల్దారుపల్లి హత్యకేసులో మరో మలుపు

నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అనేకమంది బెల్టు షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాకడంతో కాపురాలు వీధి పాలు అవుతున్నాయి..
చండ్రుగొండ ప్రధాన కేంద్రం గా అధికార వైన్ షాప్ కు నిత్యం వచ్చే మద్యం ప్రియులకు ఎమ్మార్పీ ధరల కు అమ్మకాలు చేస్తున్నారు. కానీ సిండికేట్ కారణంతో విచ్చలవిడిగా పెరిగిపోతున్న బెల్ట్ షాప్ నిర్వాహకులు వల్ల క్వాటర్ 30/రూ. లు హాఫ్ పై 60/రూ. లు ఫుల్ పై కనీసం 120/రూ. లు బీర్ పై 50/రూ. లు అదనంగా వసూలు చేస్తున్నారు. వైన్ షాపుల్లో లేని బ్రాండ్లు బెల్ట్ షాప్ లో ఉండడం గమనార్హం. ప్రతి ఒక గ్రామంలో వీధి వీధికి బెల్ట్ షాప్ వెలవటంతో ఆంతర్యమేమిటో అర్థంకాని పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే సంబంధిత అధికారులు, కేవలం గుడుంబా స్థావరాల పై దృష్టి పెట్టడంతో పరోక్షంగా బెల్టుషాపులు నిర్వాహకులను పెంచి పోషించినట్లుoదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలం మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా మొత్తం గ్రామ పంచాయతీల్లో సుమారు 200 పైగా బెల్టుషాపులు నిర్వాహకులు బెల్టుషాపులు నడుపుతున్నారు.
పట్టణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో రాత్రి సమయంలో మద్యం దొరకదు కానీ గ్రామాలలో ఏ మధ్య రాత్రి అయిన బెల్టు షాపు తలుపు తట్టిన చాలు (ఏ టీ ఎం) లాగ కావలసిన మద్యం ప్రత్యక్షం అవుతుంది. ధర ఎంతైనా పర్వాలేదు అన్నట్లుగా మద్యం ప్రియులు వ్యవహారం ఉంది.

== రేషన్ దుకాణాల్లో  (రా)బందువులు
== పెడదారి పడుతున్న యువత…
గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు నిర్వహణతో ప్రధానంగా యువత పెడదారిలో ప్రయాణిస్తుంది. ఎంతో విలువైన తమ భవిష్యత్తును అబాసుపాలు చేసుకుంటున్నారు. గ్రామాల్లో రాత్రి మద్యం అమ్మకాలు చేయడం వల్ల యువత మద్యం మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా అయిపోయింది. కొన్ని సందర్భాల్లో తమ విలువైన ప్రాణాలను కూడా యువత పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.
== పేరుకు కిరాణం.. అమ్మేది మద్యం*
మండలంలోని పలు గ్రామాల్లో ఎక్కువమంది పేరు కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. సొంత ఇళ్లలో పెద్ద ఫ్రిజ్ పెట్టుకుని మరీ మద్యం విక్రయిస్తున్నారు. కిరాణం దుకాణం దగ్గర మద్యం సేవించి ఇళ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్టుషాపులు కారణంగా మద్యం ఏరులై పారుతుంది.
పచ్చని సంసారంలో మద్యం చిచ్చు
విచ్చలవిడిగా గ్రామాల్లో దొరుకుతున్న మద్యం పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోంది. దీంతో పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వేచిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో భార్య భర్తలు గొడవలు పడి మద్యం మత్తులో క్షణికావేశం లో ఏమి జరిగింది అనే తెలుసుకునే లోపు కుటుంబంలో ఉన్న వ్యక్తులు అనాధలుగా మారిపోతున్నారు.

ALLSO READ- అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి.
== గ్రామాల్లో బెల్టు షాపులు వేలం పాటలు
మండలంలోని పలు గ్రామాల్లో బెల్టుషాపు నిర్వహణకు వేలం వేస్తున్నారు. గ్రామ పెద్దలు అంతా కలిసి గ్రామ అభివృద్ధి కోసం కొంత సొమ్ము ఇవ్వాలని తీర్మానాలు సైతం చేస్తున్నారు. ఈ సొమ్మును గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. మండలంలోని నాలుగు, ఐదు, పంచాయతీల్లో లక్షల్లో వేలం వేయడం జరిగింది. ఏడాది నుండి రెండేళ్ళపాటు గ్రామంలో మద్యం విక్రయాలు నిర్వహించేందుకు గ్రామ పెద్దలతో కలిసి తీర్మానం చేశారు.
== పట్టించుకోని అధికారులు
గ్రామాల్లో మద్యం అమ్మకాలు సిండికేట్ గా మారడం తో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. హోటల్ లు కిరాణా షాపులు, బెల్టు షాపు గా తయారవుతున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లాభార్జన దేంగా గ్రామీణ ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు. మద్యం షాపులు రహదారుల పక్కన నిర్వహించరాదని అధికారికంగా వెల్లడించినప్పటికి గ్రామాల్లో రోడ్డు పక్కన దర్జాగా మద్యం విక్రయిన్నా సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో ఉండి పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి..