Telugu News

న్యాయం చేయాలని పెట్రోల్ పోసుకున్న యువరైతు

** మండల రెవిన్యూ కార్యాలయంలో ఉద్రిక్తత

0

న్యాయం చేయాలని పెట్రోల్ పోసుకున్న యువరైతు
** మండల రెవిన్యూ కార్యాలయంలో ఉద్రిక్తత
** మండల రెవెన్యూ కార్యాలయం లో నిరసన.
** తహసిల్దార్ హామీతో విరమణ.
( చండ్రుగొండ -విజయం న్యూస్ ):

తన భూమి తనకు ఇవ్వాలని

తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ సంఘటన మరోసారి చోటు చేసుకుంది. చండ్రుగొండ మండలంలో ఓ యువ రైతు తమకు న్యాయం చేయడం లేదని, కావాలనే నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేయబోయాడు. దీంతో స్థానికులు అడ్డుకుని విషయం తహసీల్దార్ కు చెప్పగా, తక్షణమే స్పందించి న్యాయం చేస్తామని హామినిచ్చారు. ఈ సంఘటన చండ్రుగొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే

మండల పరిధిలోని బాల్యతండా గ్రామానికి చెందిన యువ రైతులు భూక్య రాధాకృష్ణ, భూక్య జయకృష్ణ ల చెందిన ఉమ్మడి కుటుంబ భూమిలో బోరు బావి ఉంది.  తన పక్క భూమిగల రైతు భూక్య రాందాస్ భూమిలో కొద్ది నెలల క్రితం బోరు వేయగా, తమ బోరుబావిలో నీళ్లు తగ్గిపోయి ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో  స్థానిక తహసిల్దార్ ఉషశారదా, జిల్లా కలెక్టర్ సైతం పలుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశల మేరకు తహసీల్దార్ ఇరువర్గాలకు భూక్య రాధాకృష్ణ, భూక్య రామదాసు చెందిన ఐదు వ్యవసాయ బోరు మోటార్లు ( భూక్య రాధాకృష్ణ,భూక్యా జయకృష్ణ, భూక్య రాందాస్, భూక్య రాజేష్, భూక్య దేవీ)ల కలెక్షన్లను విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి కరెంటు సరఫరా నిలుపుదల చేయించారు. ఈ క్రమంలో భూక్య రాందాస్ అనధికారికంగా ఓ మోటార్ కు కరెంటు సరఫరాను తీసుకుని వ్యవసాయ అవసరాలు వాడుకుంటున్నాడు అని అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడంలేదని, మంగళవారం తహసీల్దార్ ఉష శారద ఎదుట పెట్రోల్ బాటిల్ తో వచ్చి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రయత్నం చేయగా రెవిన్యూ సిబ్బంది చాకచక్యంతో నివారించారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ కార్యాలయం ఎదుట భూక్య రాధాకృష్ణ, జయకృష్ణ లు నిరసనకు దిగగా, తహసిల్దార్ ఉష శారద, ఎస్ఐ రాజేష్ కుమార్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. గత కొన్నేళ్లుగా గ్రామములో భూక్యా రాధాకృష్ణ, భూక్యా రాందాసు, కుటుంబాల మధ్య పాత కక్షలు ఉన్నాయని, ఈ క్రమంలోనే బోరుబావుల విషయంలో మరోసారి బహిర్గతం అయిందని గ్రామస్తులు చెబుతున్నారు. తహసీల్దార్ కు ఉష శారద ఫిర్యాదు మేరకు ఎస్ ఐ బి రాజేష్ కుమార్ దర్యాప్తు చేపట్టారు

ఇది కూడా చదవండి : – ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ విజయం