Telugu News

చండ్రుగొండలో అర్ధరాత్రి మట్టి అక్రమ రవాణా కు చెక్

రెండు జెసిబి లు ఆరు టాక్టర్లు సీజ్ చేసిన ఎస్ఐ

0

అర్ధరాత్రి అక్రమ మట్టి రవాణాకు చెక్
** రెండు జెసిబి లు ఆరు టాక్టర్లు సీజ్ చేసిన ఎస్ఐ
(చండ్రుగొండ -విజయం న్యూస్ ):-
మండల పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మట్టి ఇసుక తోలకాలు నిర్వహించినట్లు తెలిస్తే అట్టి వాహనాలను సీజ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్స్ స్పెక్టర్ గొల్లపల్లి విజయలక్ష్మి అన్నారు. శనివారం అర్ధరాత్రి ఏలాంటి అనుమతులు లేకుండా మట్టి తోలకాలు నిర్వహిస్తున్న రెండు జెసిబి లను ఆరు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సబ్ ఇన్స్ స్పెక్టర్ గొల్లపల్లి విజయలక్ష్మి వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని పోకలగూడెం గ్రామంలో కొంతమంది ఎలాంటి అనుమతులు లేకుండా అర్దరాత్రి మట్టితోలకాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో మా సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ భూమిలో జెసిబి తో మట్టి తోలకాలు నిర్వహిస్తున్నారు. పోలిస్ వాహనాన్ని చూసిన కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు అక్కడి నుంచి ట్రాక్టర్లను తీసుకుని పారిపోయారని సంఘటనా స్థలంలో ఉన్న జెసిబి ని ఒక ట్రాక్టర్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. అదే విధంగా రేపల్లెవాడ గ్రామ పంచాయతీ శివారు పెద్దవాగు వద్ద తెల్లవారుజామున అనుమతులు లేకుండా మట్టి తోలకాలు నిర్వహిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఆ ప్రాంతానికి చేరుకొని ఒక జెసిబి ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలిస్ స్టేషన్ తరలించినట్లు తెలిపారు. మొత్తం రెండు జెసిబి లు ఆరు ట్రాక్టర్లు సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రంగారావు, కానిస్టేబుల్స్ శివ, కోటి, హోంగార్డు లాజర్ తదితరులు పాల్గొన్నారు.

allso read- కోదాడ క్రాస్ రోడ్డులో ప్రమాదం