చండ్రుగొండ హైస్కూల్ ల్లోఘనంగా ఆత్మీయ సమ్మేళనం
== జ్ఞాపకార్ధం గా జిరాక్స్ మిషన్,ఫర్నిచర్ వితరణ
== గత మధుర అనుభూతులను పంచుకొన్న పూర్వపు విద్యార్థులు
చండ్రుగొండ జూలై 3 (విజయం న్యూస్)
జిల్లా పరిషత్ హైస్కూల్ చండ్రుగొండ 2000 -2001 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. సుమారు ఇరవై సంవత్సరాల అనంతరం కలుసుకొన్న ఈ విద్యార్థులు ,ఆత్మీయంగా పలకరించుకొన్నారు.ఆనాటి మధుర సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకొన్నారు.ఒకరికొకరు తమ జీవిత అనుభవాలను పంచుకొన్నారు.గతం లొ తాము తిరుగాడిన తరగతి గదులను చూసి ఆనందాన్ని ఆస్వాదించారు. తమకు చదువు నేర్పిన ఉపాద్యాయులను సన్మానించి వారి ఆశీస్సులు పొందారు.తమ తోటి విద్యార్థులు,మిత్రులు అయిన నాగ సుధారాణి,తిప్పనపల్లి వెంకటరమణ,దామరచర్ల రాధాకృష్ణ లు మరణించి నందున వారికి ప్రగాడ సానుభూతి తెలిపి,ఘన నివాళి అర్పించారు. అనంతరం వారి జ్ఞాపకార్థం నలభైవేలరుపాయల జిరాక్స్ మిషన్,పన్నెండువేల రుపాయల ఫర్నీచర్ను పాఠశాల కు అందించారు. ఆత్మీయ సమ్మేళనం లొ చివరగా అందరు కలిసి పాత జ్ఞపకాలను నెమరువేసుకొంటు విందుభోజనం చేసారు. ఈ కార్యక్రమం లొ పూర్వ ఉపాద్యాయులు పాపారావు,నాగేశ్వరరావు, హెడ్ మాస్టర్ ఆనంద్, ఎస్.ఎం సి కమిటీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి లతోపాటు పూర్వపు విద్యార్థులు ప్రశాంతి, వాసవి, ఉమా,సంకా క్రుపాకర్,మొహన్,రాజారావు,వైరమ్ రాజేందర్,శ్రీనివాసరెడ్డి, డి.రమేష్,రాజా లక్ష్మణ్ ప్రభ్రుతులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : – మద్దులపల్లి మార్కెట్ లో అక్రమాలు నిజమెంతా..?