Telugu News

ఇంటి మీద బెంగతో గూడ దూకిన విద్యార్థిని.. ఏమందంటే..?

ప్రాణప్రాయం నుంచి బయటపడిన బాలిక

0

ఇంటి మీద బెంగతో విద్యార్థిని ఏం చేసిందంటే..? 

= వసతి గృహం పైనుంచి దూకిన విద్యార్థిని

– కింద బురద ఉండటంతో కాలు విరిగి ప్రాణాపాయం నుండి బయట పడ్డ బాలిక
(రిపోర్టర్-శివనాగిరెడ్డి)
 చండ్రుగొండ ఆగస్టు 2 (విజయం న్యూస్ ):-
ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని వసతి గృహం పై నుండి దూకి కాలు విరగ్గొట్టుకున్న సంఘటన మంగళవారం మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని తుంగారం గ్రామానికి చెందిన పప్పుల ప్రమీల స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో ఆరో తరగతి చదువుతుంది. ఇటీవల తల్లిదండ్రులు వసతిగృహానికి వచ్చినప్పుడు ప్రమీల తాను హాస్టల్ లో ఉండనని ఇంటికి తీసుకెళ్లమని బతిమిలాడింది కానీ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవడంతో వసతిగృహాంలో ఉండిపోయింది. మంగళవారం ఉదయం తోటి విద్యార్థులతో కేజీబీవీ బిల్డింగ్ ఎక్కి అక్కడ బట్టలు ఆరవేసుకుంటూ ఒక్కసారిగా పైనుండి కిందకు దూకింది. దీంతో తోటి విద్యార్థులు గమనించి వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించడంతో విద్యార్థినిని హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో విద్యార్థిని కాలు విరిగింది భవనం పై నుండి కిందకు దూకిన స్థలంలో నీరు, బురద, ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు తెలిపారు. సంఘటన జరిగే సమయంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి వసతి గృహంలో లేకపోవడం గమనార్ధం. కేజీబీవీ ప్రత్యేక అధికారి స్థానికంగా ఉండేలా చూడాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ప్రస్తుతం విద్యార్థిని కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.