Telugu News

పునాదుల్లోనే (పురిటి) నొప్పులు…

0

పునాదుల్లోనే (పురిటి) నొప్పులు…

★★ నిధులు లేక నిలిచిపోయిన రెండు పడకల ఇళ్ల నిర్మాణాలు…
(రిపోర్టర్-శివనాగిరెడ్డి)
 చండ్రుగొండ ఆగస్టు 26 ( విజయం న్యూస్):-
ఇల్లు పీకి పందిరి వేశారు… అన్న సామెత పెద్దలు చెప్పినట్లు ఎప్పుడో చిన్నతనం లో విన్నట్లు అనిపిస్తుంది.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పేదోడి పరిస్థితి మాత్రం మారలేదు. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు ఏళ్ల ఏళ్లుగా శిధిలమవుతున్న గుడిసెలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు కూలి పోతాయో తెలియదు. వాన వస్తే నీరు దరా లై పారుతుంది. గట్టిగా గాలి వస్తే పైకప్పు ఉంటుందో ఊడిపోతుంది తెలియదు.
బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన పరిస్థితి. పేదవాడి సొంత ఇంటి నిర్మాణం కల కలగానే మిగులుతోంది. అదిగో డబుల్ బెడ్రూం ఇల్లు ఇదిగో శంకుస్థాపన అనడమే తప్ప ఆచరణలో అమలు కావడం లేదు. వర్షాలకు తడిసి అవి ఎప్పుడు కూలుతాయో అని భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నారు . ప్రజాస్వామ్య పాలనలో ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ప్రజలకు అవిస్తాo .. ఇవిస్తాం అంటూ వాగ్దానాలు చేస్తున్న నేతలు.. అధికారంలోకి వచ్చాక వాగ్దానాలను గాలికి వదిలేస్తున్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డబల్ బెడ్ రూమ్ పథకాన్ని తీసుకు వచ్చింది. కానీ ఈ పథకం ఏ మాత్రం ముందుకు సాగడం లేదు దీంతో ఏళ్లకేళ్లు గడుస్తున్న పేదవాడి సొంత ఇంటి కల మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.
 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మాణంలో మండలంలో పునాదుల్లోనే పురిటినొప్పులు పడుతుంది. అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. టెండర్ పొందిన గుత్తేదారు అత్యుత్సాహంతో పనులు మొదలు పెట్టిన పునాది స్థాయిలోనే బిల్లులు విడుదల చేయకపోవడంతో ఏడాది కాలం నుండి పనులు నిలిపివేశారు.
భద్రాద్రి కొత్తగూడెం (జిల్లా ) చండ్రుగొండ మండలం లో సత్యనారాయణ పురం గ్రామంలో నిర్మించ తలపెట్టిన 20 డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లు పునాది కై పరిమితమయ్యాయి. సత్యనారాయణ పురం గ్రామానికి 40 డబల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కాగా రూ. కోటి 80 లక్షల అంచనాలతో 40 డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు మంజూరు అయ్యాయి. టెండర్ పొందిన గుత్తేదారు మొదటి విడతగా 20 ఇళ్ల నిర్మాణాలను పునాది స్థాయిలో నిర్మించారు. వీటికి సంబంధించిన సుమారు 20 లక్షల వరకు బిల్లులు ఏడాది గడుస్తున్నా, చెల్లింపులు జరగలేదు. సంబంధిత ప్రభుత్వ అధికారులను అడగగా ప్రభుత్వం వద్ద నిధులు లేవని అధికారులు చెప్పడంతో సదరు కాంట్రాక్టర్ అసహనానికి గురై పనులను నిలిపివేశారు. వడ్డీ లపై తెచ్చి పెట్టుబడులు వెచ్చించ మని గుత్తేదారు వాపోతున్నారు. తిప్పన పల్లి లో గ్రామం లో నిర్మించిన 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా నిధుల విడుదలలో జాప్యం తో చివరి దశలో కి వచ్చి ఆగిపోవడం జరిగింది.
 ఏజెన్సీ ప్రాంతం అంటే చాలు అటు పాలకులకు, ఇటు అధికారులకు చిన్న చూపే. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో.. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకు సాక్ష్యం మండలం లో ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లులె..
 అసంపూర్తిగా ఇల్లు నిర్మాణాలు జరగడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి.. నిర్మాణ దశలోనే ఆగిపోవడంతో మందు బాబులకు, పేకాటరాయుళ్ల కు అడ్డాలుగా మారుతున్నాయి… సంబంధిత అధికారులు చొరవ తీసుకొని డబుల్ బెడ్ రూమ్ పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు